Film Releases: కళకళలాడుతున్న థియేటర్లు.. ఈ వారం సినిమాలివే!

వీకెండ్ వచ్చిందంటే చాలు ధియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. నెక్ట్స్ మన్త్ నుంచి పెద్ద సినిమాల హడావిడి స్టార్ట్ అవుతుండడంతో ఈ గ్యాప్ లోనే చిన్న సినిమాలు అన్నీ రిలీజ్..

Film Releases: కళకళలాడుతున్న థియేటర్లు.. ఈ వారం సినిమాలివే!

Film Releases (1)

Film Releases: వీకెండ్ వచ్చిందంటే చాలు ధియేటర్లు కొత్త సినిమాలతో కళకళలాడుతున్నాయి. నెక్ట్స్ మన్త్ నుంచి పెద్ద సినిమాల హడావిడి స్టార్ట్ అవుతుండడంతో ఈ గ్యాప్ లోనే చిన్న సినిమాలు అన్నీ రిలీజ్ లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. అలా ఈ వారం ధియేటర్లోకి రాబోతున్నాయి కొన్ని ఇంట్రస్టింగ్ మూవీస్. వీకెండ్ హడావిడి థియేటర్లలో స్టార్ట్ అయ్యింది. ఈ వారం కూడా రిలీజ్ అవ్వడానికి సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం పెద్ద సినిమాల రిలీజ్ లేకపోయినా.. రిలీజ్ అవుతున్న వాటిలో ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా అనుభవించురాజా.

RRR Movie : సోల్ ఆంథమ్ ‘జనని’ వచ్చేసింది..

రాజ్ తరుణ్ హీరోగా నాగార్జున ప్రొడ్యూస్ చేస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ నవంబర్ 26న ధియేటర్లోకి వచ్చేసింది. శీను గవిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లు సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. తన అప్పియరెన్స్ తోటి సినిమాకు క్రేజ్ తీసుకొస్తున్న హీరో సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో హిలేరియస్ గా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసిన సంపూర్ణేష్ బాబు.. లేటెస్ట్ గా కాలీఫ్లవర్ సినిమాతో ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొచ్చేశాడు.

Film Promotions: ప్రమోషన్లతో మోత మోగించేస్తున్న స్టార్ మూవీస్

ఈ వారం టాలీవుడ్ లో స్టార్ మూవీస్ ఏం రిలీజ్ కాకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం పెద్ద సినిమా రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ హీరోలుగా తెరకెక్కిన అన్తిమ్ మూవీ ఈ శుక్రవారం ధియేటర్లో రిలీజ్ అయింది. మహేష్ మంజ్రేకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ కాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాలో సల్మాన్ ఖాన్.. సిక్ పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు. సల్మాన్ బావ ఆయుష్ శర్మ.. నెగెటివ్ షేడ్ లో కనిపిస్తున్నారు. ఈ ఇంట్రస్టింగ్ మూవీ నవంబర్ 26న ఆడియన్స్ ముందుకొచ్చేసింది.

RRR: విజువల్ ట్రీట్.. హాట్ టాపిక్‌గా మారిన రన్ టైం..!