RC 15 : రామ్ చరణ్ రికార్డుల ‘రచ్చ’ స్టార్ట్ చేసేసాడు..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ రిలీజ్‌కి ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు..

RC 15 : రామ్ చరణ్ రికార్డుల ‘రచ్చ’ స్టార్ట్ చేసేసాడు..

Rc 15

RC 15: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబోలో రానున్న RC 15 సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సినిమా ఓపెనింగ్ రోజు ‘వుయ్ ఆర్ కమింగ్’ అంటూ ఆర్టిస్టులు, టెక్నీషిన్లు అందరూ సూట్స్ వేసుకుని పోస్టర్ రిలీజ్ చెయ్యగా బాగా వైరల్ అయ్యింది.

Dr.Rajasekhar : పవర్‌ఫుల్ ‘శేఖర్’ గా డా.రాజ‘ ‘శేఖర్’..

ఈ సినిమా గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RC 15 థియేట్రికల్ అండ్ శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయట. రూ. 350 కోట్ల భారీ మొత్తానికి జీ స్టూడియోస్ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకుంది. మ్యూజిక్, ఓవర్సీస్ అండ్ రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

‘వినయ విధేయ రామ’ తర్వాత కియారా అద్వాణీ చెర్రీతో జతకడుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నాడు. మొత్తం ఏడు పాటలుంటాయని, ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశానని ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే.

RC 15 : అప్పుడు యాక్టర్.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..!