Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. కొత్త సినిమా అప్ డేట్స్ ఇస్తారా లేదా అంటూ బెదిరిస్తున్నారు. అసలే సాహో, రాధేశ్యామ్ రిజల్ట్ తో డీలా పడ్డ అభిమానులు.. వాళ్ల అంచనాలన్నీ అప్ కమింగ్ మూవీస్ పైనే పెట్టుకున్నారు.

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. కొత్త సినిమా అప్ డేట్స్ ఇస్తారా లేదా అంటూ బెదిరిస్తున్నారు. అసలే సాహో, రాధేశ్యామ్ రిజల్ట్ తో డీలా పడ్డ అభిమానులు.. వాళ్ల అంచనాలన్నీ అప్ కమింగ్ మూవీస్ పైనే పెట్టుకున్నారు. అయితే ఆ సినిమాల నుంచి ఎంతకీ అప్ డేట్స్ రాకపోవడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి పెంచేస్తున్నారు.
Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!
బాహుబలి 2 తర్వాత కళ్లు కాయలు కాచేలా ప్రభాస్ సినిమా కోసం ఎదురుచూసారు. సాహో, రాధేశ్యామ్ రిలీజ్ సమయంలో తగ్గేదే లే అన్న లెవెల్ లో సందడి చేశారు. కానీ రెండు సినిమాలు నిరాశపరచడంతో ఫుల్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డార్లింగ్ చేస్తోన్న నెక్ట్స్ పాన్ ఇండియా సినిమాలపైనే హోప్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా సలార్ సినిమా అప్ డేట్స్, గ్లింప్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తో సెన్సేషనల్ రికార్డులను తిరగరాస్తున్న ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి పెంచేస్తున్నారు.
Salaar: కేజీయఫ్ 2 ఎఫెక్ట్ సలార్‌పై పడిందా..?
రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు అప్ డేట్స్ లేవా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్.. డైరెక్టర్ రాధాకృష్ణతో పాటూ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ ను ఓ ఆటాడుకున్నారు. సోషల్ మీడియా పోస్ట్ లతో విపరీతంగా హడావిడీ చేసారు. ఇక రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత సైలంట్ అయిన అభిమానులు మళ్లీ కామెంట్స్ షురూ చేసారు. సలార్ స్టార్ట్ అయి ఇన్ని నెలలు దాటినా… ఒక్క లుక్ తప్ప ఏదీ రిలీజ్ చేయని ప్రశాంత్ నీల్ పై ఇప్పుడు ఫ్యాన్స్ ఎఫెక్ట్ పడింది. మే నెల చివరిలోగా సలార్ గ్లింప్స్ రిలీజ్ చేయకుంటే సూసైడ్ చేసుకుంటానని ఒకడు లెటర్ రిలీజ్ చేశాడు. సో అప్ డేట్స్ లేట్ అవుతున్న కొద్దీ కొందరి పిచ్చి ఇలా పరాకాష్టకు చేరుకుంటోంది.
Salaar: యష్ నెవర్ బిఫోర్ యాక్షన్.. అంతకుమించి ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ తో పాటూ ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మొదలుపెట్టాల్సి ఉంది. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ మొత్తం పూర్తయింది కూడా. కానీ ఏ ఒక్క డార్లింగ్ మూవీ నుంచి సరైన అప్ డేట్స్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఇక్కడే ప్రభాస్ సినిమాలపై దెబ్బ పడుతోంది. ఈ విషయంలో రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. సినిమా మొదలెట్టగానే క్యారెక్టరైజేషన్ వీడియోలతో పాటూ వరుసగా ఏదో ఒక అప్ డేట్ ఇచ్చి ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంటారు జక్కన్న. సేమ్ ప్రస్తుతం ప్రభాస్ ను డైరెక్ట్ చేస్తోన్న మేకర్స్ నుంచి ఇలాంటి సరుకునే కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
- Prabhas: మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్.. ప్రభాస్ కోసం అనుష్క?
- KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్ 3.. మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు?
- Movie Collections: ఫస్ట్ డే ఎలా దండుకోవాలి.. ఇదే ఇప్పుడు సక్సెస్ ఫార్ములా!
- KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్3 షూటింగ్ స్టార్ట్.. ప్రొడ్యూసర్ బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్!
- Prabhas: ప్రభాస్ కోసం పోటీపడుతున్న కియారా, రష్మిక.. ఎవరు సెట్ అవుతారో?
1Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
2Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
3McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
4VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
5Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
6CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
7TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
9Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
10Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!