Pathaan : పఠాన్ సినిమాకి ప్రమోషన్స్ చేయరా?? కారణం అదేనా..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ జనవరి 25 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజున షారుఖ్ లేటెస్ట్ మూవీ పఠాన్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్స్ తో బిజీగా ఉండాల్సిన టీం ‘పఠాన్’ సినిమాకి...............

Pathaan : పఠాన్ సినిమాకి ప్రమోషన్స్ చేయరా?? కారణం అదేనా..

there is no promotions for Pathaan Movie

Pathaan :  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ మరో 4 రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. దాదాపు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత కింగ్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ పఠాన్ మూవీ కోసం షారుఖ్ అండ్ టీమ్ ఓ కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ జనవరి 25 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ రోజున షారుఖ్ లేటెస్ట్ మూవీ పఠాన్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్స్ తో బిజీగా ఉండాల్సిన టీం ‘పఠాన్’ సినిమాకి నో మీడియా ఇంటర్వ్యూస్, నో అదర్ ప్రమోషన్స్ అంటుంది. హీరో షారుఖ్ ఖాన్ నుంచి విలన్ జాన్ అబ్రహం వరకూ ఇందులోని నటీనటులు సినిమాకి సంబంధించి ఎలాంటి ఇంటర్యూస్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

బాలీవుడ్ లో ఉన్న నెగిటివిటిని, ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న వివాదాలకు ప్రమోషన్స్ చేసి మరింత వివాదాల్లోకి వెళ్లేకంటే సైలెంట్ గా ఉండి ఉన్న అంచనాలని మెయింటైన్ చేసుకుంటూ సినిమాపై వస్తున్న నెగెటివిటీని, వివాదాల్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికే ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని సమాచారం. ఇంతకు ముందు అజయ్ దేవ్ గణ్ ‘దృశ్యం 2’ కోసం మేకర్స్ ఇలాగే చేయడంతో రిజల్ట్ బాగుందని వీళ్ళు కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు.

Mahesh – Rajamouli Movie : మహేష్ సినిమా రాజమౌళికి సవాలు విసురుతుందా??

షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాకి బడ్జెట్ ఒక ఎత్తైతే ప్రమోషన్స్ కు అయ్యే ఖర్చు మరో ఎత్తు. అయితే పఠాన్ విషయంలో ప్రమోషన్స్ లాంటివి నిర్వహించకపోవడం వల్ల నిర్మాతలకు 10 కోట్ల వరకు సేవ్ అయినట్టే అని సమాచారం. ఇంతకు ముందు రిలీజైన పాట విషయంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. సినిమాపై బాగా నెగిటివిటి వచ్చింది. సినిమా రిలీజ్ ముందు మూవీ టీమ్ ఏం మాట్లాడినా అది మరింతగా వివాదాలకి కారణమవుతుంది. ప్రజెంట్ మూవీకి ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోంది. సో సినిమాకి ఇంక ప్రమోషన్స్ అనవసరం అని మేకర్స్ భావిస్తున్నారు. మరి ప్రమోషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ లేకుండా సినిమా జనంలోకి ఎలా వెళుతుందో చూడాలి. కేవలం షారుఖ్ సినిమా అని, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నదని హైప్ మాత్రమే జనాల్లో ఉంది. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి బాలీవుడ్ కి.