Movie Releases: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే!

ధియేటర్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి. ఓటీటీలో కూడా తగ్గేదే లే అంటూ వరసగా సినిమాలు, సిరీస్ లు, షోలు..

Movie Releases: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలివే!

Movie Releases

Movie Releases: ధియేటర్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి. ఓటీటీలో కూడా తగ్గేదే లే అంటూ వరసగా సినిమాలు, సిరీస్ లు, షోలు దుమ్మురేపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా ఓటీటీలతో పాటు ధియేటర్లు కూడా.. ఈ వీక్ ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యబోతున్నాయి.

Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!

ధియేటర్లో ట్రిపుల్ఆర్ సందడి కంటిన్యూ అవుతోంది. అయినా కూడా ఈ వారం ధైర్యం చేసి చిన్న సినిమాలు ధియేటర్లోకొస్తున్నాయి. అలా ఏప్రిల్ ఫస్ట్ న ధియేటర్లోకి వస్తోంది మిషన్ ఇంపాజిబుల్. ఇదేదో టామ్ క్రూజ్ సినిమా అనుకుంటే పొరపాటే. ఈ క్రేజీ టైటిల్ తో తెలుగులో మిషన్ ఇంపాజిబుల్ మూవీ రిలీజ్ అవుతోంది. తాప్సీ మెయిన్ లీడ్ లో స్వరూప్ రాజ్ డైరెక్షన్లో దావూద్ ఇబ్రహీంని వెతికి పట్టుకోవడానికి బయల్దేరిన ముగ్గురు పిల్లల స్టోరీయే మిషన్ ఇంపాజిబుల్ మూవీ. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తెలుగులో ఈ శుక్రవారం ధియేటర్లోకొస్తోంది.

Movie Releases: కళకళాడుతున్న టాలీవుడ్.. ఎటు చూసినా ఫుల్ జోష్!

ఏప్రిల్ ఫస్ట్ న బాలీవుడ్ ధియేటర్లోకొస్తున్న యాక్షన్ మూవీ ఎటాక్. జాన్ అబ్రహం, జాక్విలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్స్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఎటాక్ చాలాసార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత లాస్ట్ కి ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. లక్ష్యరాజ్ డైరెక్షన్లో జాన్ అబ్రహం పవర్ ఫుల్ కాప్ గా కనిపిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ ఫస్ట్ న ధియటేర్లోకొస్తోంది.