Chiranjeevi : ఆగస్టు 22, సెప్టెంబర్ 22.. చిరు జీవితంలో మర్చిపోలేని రోజులు..

ఆగస్టు 22వ తేదికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. ఆ రోజు కొణిదెల శివ శంకర ప్రసాద్ పుట్టినరోజు..

Chiranjeevi : ఆగస్టు 22, సెప్టెంబర్ 22.. చిరు జీవితంలో మర్చిపోలేని రోజులు..

Chiru

Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. ‘పునాది రాళ్లు’ తో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ‘ప్రాణం ఖరీదు’ సినిమానే.

Chiranjeevi : బాస్ బర్త్‌డే.. మెగా అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయ్..

ఆగస్టు 22వ తేదికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఆ రోజు కొణిదెల శివ శంకర ప్రసాద్ పుట్టినరోజది. తర్వాత కొన్నాళ్లకు ఆగస్టు 22 అంటే మెగాస్టార్ బర్త్‌డే అనేంతగా మారిపోయింది. చిరు జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యం ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది.

Chiru

ఆగస్ట్ 22 ఆయన పుట్టినరోజైతే.. సెప్టెంబర్ 22 నటుడిగా ‘ప్రాణం (ఖరీదు)’ పోసుకున్న రోజు. 1978 సెప్టెంబర్ 22 న రిలీజ్ అయ్యిందీ సినిమా.. ఆ రకంగా ఈ రెండు 22వ తేదీలు మెగాస్టార్ లైఫ్‌లో మెమరబుల్ డేస్‌గా గుర్తుండిపోతాయి. మామూలు నటుడిగా ప్రారంభమై మెగాస్టార్‌గా ఎదిగిన చిరు ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

Chiranjeevi : బాస్ స్పీడ్..! చిరుని ఇంప్రెస్ చేసిన మరో డైరెక్టర్..

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయణ్ణి స్పూర్తిగా తీసుకుని నటులైన వారు చాలామందే ఉన్నారు. స్టైల్, మేనరిజమ్, మాస్ ఆడియెన్స్‌ను మెప్పించడం, జానర్ ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో నిండుదనం తీసుకురావడం ఒక్క చిరంజీవికే సాధ్యం.

Chiranjeevi : మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ అగ్ర సింహాసనాన్ని మకుటంలేని మహారాజుగా ఏలారు. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు.. మెగాభిమానులకు పండుగ రోజు.. రీ ఎంట్రీలో స్పీడ్ పెంచిన చిరు వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. ‘ఆచార్య’ ముగింపు దశకు రాగానే ‘లూసీఫర్’ రీమేక్ పట్టాలెక్కించారు. మరో రెండు కొత్త సినిమాలు కూడా కన్ఫమ్ చేసేశారు చిరంజీవి.

Chiranjeevi