DSP-Thaman: పోటీపడుతున్న ఈ ఇద్దరూ.. మ్యూజిక్‌తో బాక్సులు బద్దలే!

నామ్యూజిక్ బావుండాలి అంటే.. నామ్యూజిక్ బావుండాలి అంటూ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. పోటీకి తగ్గట్టే వరస పెట్టి సినిమాలు చేస్తూ ఒకర్నొకరు ప్రూవ్ చేసుకుంటున్నారు.

DSP-Thaman: పోటీపడుతున్న ఈ ఇద్దరూ.. మ్యూజిక్‌తో బాక్సులు బద్దలే!

Dsp Thaman

DSP-Thaman: నామ్యూజిక్ బావుండాలి అంటే.. నామ్యూజిక్ బావుండాలి అంటూ మ్యూజిక్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. పోటీకి తగ్గట్టే వరస పెట్టి సినిమాలు చేస్తూ ఒకర్నొకరు ప్రూవ్ చేసుకుంటున్నారు. అదిరిపోయే ట్రాక్స్ తో.. మెస్మరైజింగ్ ట్యూన్స్ తో రెడీ అవుతున్నారు దేవిశ్రీ ప్రసాద్, తమన్. టాలీవుడ్ లోనేకాదు.. సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పోటీపడుతున్నారు థమన్, దేవిశ్రీప్రసాద్. రేస్ ఫస్ట్ దేవిశ్రీ స్టార్ట్ చేసినా.. లీడ్ కోసం ఎప్పటికప్పుడు పోటీపడుతూనే ఉన్నారు ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ కంపోజర్లు.

Bollywood Heroins: తెలుగు హీరోలపై బాలీవుడ్ భామల ఇంట్రెస్ట్.. ఇదోరకం స్ట్రాటజీనా?

అందుకే ఎక్కడా చూసినా ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ ల సినిమాలే కనిపిస్తున్నాయి. ఈరేస్ లో థమన్ కాస్త అప్పర్ హ్యాండ్ చూపిస్తున్నాడు. పోస్టర్లు, టీజర్ల దగ్గరనుంచి ప్రమోషనల్ వీడియోల వరకూ ప్రతి చిన్నవిషయంలో ఫుల్ కాంపిటీటివ్ గా ఉన్న థమన్, దేవిశ్రీ ప్రసాద్ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయిన పుష్ప, అఖండ సినిమాల కలెక్షన్లతో పాటు మ్యూజిక్ కూడా పోటీపడుతూనే ఉంది. పుష్పతో దేవిశ్రీ అదిరిపోయే మాస్ ట్యూన్స్ ఇంకా సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పుష్పలో సాంగ్స్ కి బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు డచ్, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కూడా రీల్స్, రీక్రియేషన్స్ తో ఫుల్ సందడి చేస్తున్నాయి.

Mohan Babu-Lakshmi Manchu: తండ్రీ-కుమార్తె ప్రధాన పాత్రల్లో మూవీ ప్రారంభం!

ఇక థమన్ అయితే సీనియర్ హీరోలకు కూడా అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నాడు. ఓన్లీసాంగ్స్ తోనే కాకుండా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడుతున్నాడు. బాలయ్య-బోయపాటి కాంబినేషనలో వచ్చిన అఖండ సినిమాలో పాటలతో పాటు ఆర్ ఆర్ కి అమేజింగ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని ధియేటర్లు దద్దరిల్లిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరో వైపు రవితేజ లాంటి హీరోలకు కూడా పెప్పీ సాంగ్స్ ఇస్తున్నారు. తన సినిమాలో అన్ని రకాల ఆడియన్స్ ని కన్సిడర్ చేస్తూ.. ఫాన్స్ పల్స్ పట్టుకున్న దేవిశ్రీప్రసాద్.. మాస్ మహరాజా రవితేజ ఖిలాడి సినిమాకి అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. ఈ క్రేజీ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ ఒకదానికి మించి ఒకటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

సినిమాల విషయంలో చిన్నా, పెద్దా అన్న తేడా చూపించని థమన్, దేవిశ్రీప్రసాద్.. ఏ హీరో రేంజ్ కి, క్రేజ్ కి తగినట్టు మ్యూజిక్ ఇస్తారు. క్లాస్, మాస్ అన్నతేడా లేకుండా అన్ని రకాల ఆడియన్స్ కోసం హిట్ ఆల్బమ్స్ ఇస్తున్నారు. స్టార్ హీరోలతో కెరీర్ ఎప్పుడో స్టార్ట్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ట్రెండ్ ని థమన్ ఇప్పుడు ఫాలో అవుతూ.. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. థమన్.. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పాటు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా మీ ఇప్పటికే తన కామెంట్స్ హైప్స్ పెంచేసిన తమన్.. సర్కారు వారి పాట ఫస్ట్ సాంగ్ ని వాలంటైన్స్ సీజన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే భీమ్లానాయక్ పాటలు ఓరేంజ్ లో సోషల్ మీడియా రికార్డులు బద్దలుకొడుతున్నాయి.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

మాస్ ట్యూన్స్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా తగ్గేదే లేదంటున్నాడు. శర్వానంద్, రష్మిక మందాన నటిస్తున్న ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాలో అటు మాస్ కి, క్లాస్ కి రీచ్ అయ్యే మ్యూజిక్ నంబర్స్ ఇచ్చాడు. స్పెషల్లీ సినిమా టైటిల్ సాంగ్ తో మాస్ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేశాడు. థమన్ ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలే కాకుండా తమన్ చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్లో గాడ్ ఫాదర్, రామ్ చరణ్ -శంకర్ మూవీతో పాటు అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఏజెంట్, గుణశేఖర్ తో శాకుంతలం సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఇంత బిజీగా ఉన్నా వరుణ్ తేజ్ తో చేస్తున్న గని సినిమాని ప్రమోషన్స్ కి కూడా అటెండ్ అవుతున్నారు.

Malaika Arora: 48 ఏళ్ల భామ.. ఇంకా హాట్ బ్యూటీనే!

రీసెంట్ గా పుష్ప హిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవిశ్రీ, పుష్ప2 సినిమాతో పాటు రవితేజ ఖిలాడీ, వెంకటేష్ ఎఫ్ 3, వైష్ణవ్ తేజ్ రంగరంగవైభవంగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాల మధ్య పోటీ.. సంగీత దర్శకుల మధ్యకు వచ్చేసినా.. పోటీపడి మరీ హిట్ ట్యూన్స్ ఇస్తూ.. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ మీదే ఫోకస్ చేస్తున్నారు ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు.