South Stars : డెబ్యూతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..

తెలుగు, తమిళ్ యాక్టర్స్ మిగతా భాషల్లో మరి ముఖ్యంగా బాలీవుడ్‌లో నటిస్తుండడం, ఇంట్రడక్షన్‌తోనే ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..

South Stars : డెబ్యూతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..

These South Actors Creating Sensation In Bollywood With Their Debut

South Stars: మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి అనే మాట పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌‌లో కంటెంట్ అండ్ టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటుంటాయి. వాటిని ఫాలో అవుతూ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడానికి మేకర్స్ చాలా కష్టపడుతుంటారు. ఇప్పుడు కాలం మారుతోంది. సౌత్ ముఖ్యంగా తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, టాలీవుడ్, కోలీవుడ్ నటులకు ఆదరణ దక్కుతోంది. తెలుగు, తమిళ్ సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవడం అనేది పక్కన పెడితే మన నటీనటులు మిగతా భాషల్లో మరి ముఖ్యంగా బాలీవుడ్‌లో నటిస్తుండడం, ఇంట్రడక్షన్‌తోనే ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Samantha

జీవా, నాగ చైతన్య, విజయ్ సేతుపతి, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లాంటి నటీనటులు బాలీవుడ్ ఎంట్రీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
‘ది ఫ్యామిలీమెన్ – 2’ లో సమంత తన పర్ఫార్మె‌న్స్‌తో అదరగొట్టేసింది. దీంతో హిందీలో పలు క్రేజీ ప్రాజెక్టుల కోసం మేకర్స్ ఆమెని అప్రోచ్ అవుతున్నారు. భర్త నాగ చైతన్య ఏకంగా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నారు. ‘83’ తో జీవా, ‘ముంబైకర్’ తో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి హిందీలో ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

Naga Chaitanya

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సూపర్ హిట్ జోడీ..
‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో ఆకట్టుకున్న క్యూట్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక వేర్వేరు సినిమాలతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ డెబ్యూ మూవీతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న ‘రౌడీ స్టార్’ విజయ్, డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ‘లైగర్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి, ఛార్మీలకు స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహర్ యాడ్ అవడంతో సినిమా షేపే మారిపోయింది. అనన్య పాండే హీరోయిన్ కాగా ‘శివగామి’ రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అవడంతో మనోడి క్రేజ్ మరింత పెరిగింది.

Vijay Deverakonda

రష్మిక మందన్న..
‘కిరాక్ పార్టీ’ తో ఎంట్రీ ఇచ్చిన కన్నడ చిన్నది రష్మిక ‘ఛలో’, ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు,’ ‘పొగరు’, ‘పుష్ప’ సినిమాలతో సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ తో బాలీవుడ్‌కి వెళ్తోంది. ఫస్ట్ సినిమా కంప్లీట్ కాకుండానే ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్‌బై’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది రష్మిక.

Rashmika Mandanna