ఈ హీరోయిన్ల‌ను సిస్టర్స్‌గా మార్చిన స్టార్ బ్రదర్స్

ఈ హీరోయిన్ల‌ను సిస్టర్స్‌గా మార్చిన స్టార్ బ్రదర్స్

Star Heroines: లైమ్ లైట్లో ఉన్నంత కాలం హీరోయిన్లుగా చేసి ఫేడవుట్ అయ్యాక సిస్టర్ క్యారెక్టర్‌లోకి జంప్ అవుతుంటారు చాలామంది హీరోయిన్లు. కానీ స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న సాయి పల్లవి, నయన తార, కాజల్ అగర్వాల్ కూడా సిస్టర్ రోల్‌లోకి షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ బ్యూటీస్‌ని సిస్టర్స్‌గా మార్చిన స్టార్ బ్రదర్స్ ఎవరో చూద్దాం..

క్రేజీ రీమేక్‌లో నయన్..
హీరోయిన్ అంటే ఎంత కాదనకున్నా గ్లామర్ డాలే.. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు చేస్తున్నారు హీరోయిన్లు. గ్లామర్ షో ఎంత కాలం చేస్తాం అనుకుంటూ తమను టెంప్ట్ చేసే క్యారెక్టర్స్ కనిపిస్తే చెల్లెలిగా కూడా చెయ్యడానికి రెడీ అంటున్నారు. బంధాలు, బంధుత్వాలకు సరెండర్ అయిపోతున్నారు. లేటెస్ట్‌గా చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్‌లో నయన తారను చెల్లెలి క్యారెక్టర్‌లో ఫిక్స్ చేసే ప్లాన్‌లో ఉన్నారు డైరెక్టర్ మోహన్ రాజా. ‘సైరా’లో చిరంజీవికి జోడీగా కనిపించింది నయన్.

బన్నీకి చెల్లెలిగా సాయి పల్లవి..
సుకుమార్ -బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప’ సినిమాలో కూడా ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలి క్యారెక్టర్‌లో కనిపిస్తోంది. సౌత్‌లో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటున్న సాయి పల్లవి, బన్నీ చెల్లెలి రోల్ ప్లే చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీగా ప్లాన్ చేసిన ఈ మూవీకి స్ట్రెన్త్ కోసం తమిళ్, మళయాళంని కవర్ చేసే సాయి పల్లవిని సిస్టర్‌గా చూపించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

మంచు విష్ణు సోదరిగా..
సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమాలు చేసింది. దాదాపు 10 ఏళ్లకు పైగా టాప్ హీరోయిన్‌గా ఉన్న కాజల్ ..ఇప్పటి వరకూ సిస్టర్ రోల్ చేసింది లేదు. అయితే ఫస్ట్ టైమ్ మంచు విష్ణుకి సిస్టర్‌గా కనిపిస్తోంది. ‘మోసగాళ్లు’ సినిమాలో ఈ మంచు హీరోకి సిబ్లింగ్‌గా నటిస్తోంది స్టార్ హీరోయిన్ కాజల్.

మహేష్‌కి వదినగా రేణు దేశాయ్..
మరో టాలీవుడ్ సెన్సేషన్ రేణు దేశాయ్ కూడా మరో స్టార్ హీరోకి వదినగా కనిపించబోతోందంటూ టాక్ నడుస్తోంది. పరశురామ్ -మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్ నటిస్తోందంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇలా ఒక వైపు గ్లామర్, మరో వైపు సిస్టర్ రోల్స్‌తో అటు రొమాన్స్‌ని, ఇటు బంధాలు, బంధుత్వాల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు స్టార్ హీరోయిన్లు.