ఏప్రిల్ 14తో ఈ సినిమాలకు లింకేంటి!..

వివిధ సందర్భాల్లో ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమాలు..

  • Published By: sekhar ,Published On : April 14, 2020 / 04:28 PM IST
ఏప్రిల్ 14తో ఈ సినిమాలకు లింకేంటి!..

వివిధ సందర్భాల్లో ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమాలు..

ఏప్రిల్ 14.. రాజ్యంగ సృష్టికర్త అంబేద్కర్ జయంతి. అలాగే వివిధ సంవత్సరాలలో ఇదే రోజున పలు తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు ఏప్రిల్ 14తో సరికొత్త మైలురాళ్లను అధిగమించడం విశేషం. ఆ సినిమాల వివరాలు ఓసారి చూద్దాం.. 

Rojulu Marayi
‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వరరావు, జానకి జంటగా.. సారథి స్టూడియోస్ నిర్మాణంలో, తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ‘రోజులు మారాయి’ చిత్రం 1955 ఏప్రిల్ 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2020 ఏప్రిల్ 14 నాటికి ఈ చిత్రం విజయవంతంగా 65 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అక్కినేని, మంజుల జంటగా.. వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన ‘బంగారు బొమ్మలు’ 1977 ఏప్రిల్ 14న విడుదలై నేటికి 43 వసంతాలు పూర్తవుతోంది.

Bangaru Bommalu

అలాగే ఏఎన్నార్, వాణిశ్రీ, జయసుధ కలయికలో.. ఉమాలక్ష్మీ కంబైన్స్ వారి నిర్మాణంలో వి.మధు సూధనరావు దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విచిత్ర జీవితం’ చిత్రం ఏప్రిల్ 14, 1978 విడుదలై, 2020 ఏప్రిల్ 14తో 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. సూపర్ స్టార్, నట శేఖర కృష్ణ, జయప్రద జంటగా.. కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన జేమ్స్ బాండ్ మూవీ ‘ఏజెంట్ గోపి’ కూడా నేటితో 42 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

Agent Gopi

Read Also : సఖి, చంద్రముఖి, యువరాజు.. ఒకే రోజు..

అలాగే కృష్ణ, వాణిశ్రీ నటించిన కుటుంబ కథా చిత్రం ‘అత్తలూ-కోడళ్లు’ 1971 ఏప్రిల్ 14న విడుదలై నేటికి 47 సంవత్సరాలు పూర్తి కావడం విశేషం. నటభూషణ శోభన్ బాబు, లక్ష్మీ, రాధిక ప్రధాన పాత్రధారులుగా తాతినేని రామారావు తెరకెక్కించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రం విడుదలై నేటికి 37 సంవత్సరాలవుతోంది. (14/04/1983)

Mugguru Monagallu
యువరత్న నందమూరి బాలకృష్ణ, రోజా కలయికలో సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన అద్భుత జానపద చిత్రం ‘భైరవ ద్వీపం’ 26 సంవత్సరాలు, జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేయగా.. పిల్లలు ప్రధాన పాత్రధారులుగా గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘బాల రామాయణం’ 24 సంవత్సరాలు, మహేశ్ బాబు ‘యువరాజు’ 20 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ ‘తీన్‌‌మార్’ 9 సంవత్సరాలు ఏప్రిల్ 14తో పూర్తి చేసుకుంటున్నాయి.. లాక్‌‌డౌన్ నేపథ్యంలో బోలెడంత టైమ్ దొరికింది కాబట్టి అందుబాటులో ఉన్న సినిమాలను ఓ పట్టు పట్టండి మరి.. 
Bhairava Dweepam

Bala Ramayanam