Pushpa: ఇక్కడ ప్రభాస్.. అక్కడ సల్మాన్.. బన్నీ కోసం ఈ ఇద్దరూ!

అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోగానే ఉన్న బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో..

Pushpa: ఇక్కడ ప్రభాస్.. అక్కడ సల్మాన్.. బన్నీ కోసం ఈ ఇద్దరూ!

Pushpa

Pushpa: అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరోగానే ఉన్న బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే తన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ తో పాటు ఫస్ట్ టైమ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి.. బాలీవుడ్ టాప్ స్టార్ ని ప్రమోషన్ల కోసం లైన్లో పెట్టాడు అల్లు అర్జున్. బన్నీ కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దాతో ఇంతకు ముందు టాలీవుడ్ కే పరిమితమైన అల్లుఅర్జున్.. ఇప్పుడు పుష్ప మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Akhanda: బీబీ3.. హిట్ అవుతుందా? తేడా కొడుతుందా?

సౌత్ లో మళయాళం, తమిళ్ లో ఉన్న క్రేజ్ ని.. ఇప్పుడు క్యాష్ చేస్కోబోతున్నారు అల్లు అర్జున్. మరి పాన్ ఇండియా ఎంట్రీ అంటే.. ఆ సినిమాకి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో ఉండాలి కదా. అందుకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని తన ప్రమోషన్స్ లో యాడ్ చేస్తున్నారు బన్నీ. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

Bigg Boss 5: హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌కి అన్యాయం.. రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇప్పటికే ప్రమోషన్లతో ఊదరగొట్టేస్తున్న బన్నీ.. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో డైరెక్ట్ ఈవెంట్స్ కి రెడీ అవుతున్నారు. డిసెంబర్ 12న గ్రాండ్ గా జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాన్ ఇండియా రేంజ్ హీరో ప్రభాస్ ని ఇన్వైట్ చేశారని, బన్నీ అడగగానే ప్రభాస్ ఓకే చెప్పారని టాలీవుడ్ లో న్యూస్ నడుస్తోంది. పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్న బన్నీకి పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయితే .. సినిమాకి గ్యారంటీ గా స్ట్రెన్త్ యాడ్ అవుతుందని ఈ ప్లాన్ చేశారు టీమ్.

Pushpa: రికార్డ్స్ బద్దలు.. టీజర్‌కు 2 మిలియన్ లైక్స్!

సౌత్ లో ఆల్రెడీ బన్నీ కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది కాబట్టి.. ఇక్కడ ప్రమోషన్ల గురించి అంతగా వర్రీ అవ్వాల్సింది లేదు. కానీ అసలు టెన్షన్ అంతా బాలీవుడ్ గురించే. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప కోసం బాలీవుడ్ లో ప్రమోషన్ల కోసం సల్మాన్ ఖాన్ రంగంలోకి దిగుతున్నారు. సల్మాన్ ఖాన్ షో బిగ్ బాస్ కి గెస్ట్ గా అల్లు అర్జున్ వెళ్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. స్మాల్ స్క్రీన్ లో హయ్యస్ట్ రీచబిలిటీ ఉన్న షో కావడంతో బన్నీ కూడా ఇదే షో ని సెలక్ట్ చేసుకున్నారు.

Pushpa: బన్నీ మాసీనెస్.. ఫ్యాన్స్‌ని ఎలా ఎంగేజ్ చేయబోతున్నాడు?

అంతేకాదు.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో తెలుగులో బన్నీ హీరోగా వచ్చిన డీజే సినిమాలో సీటీ మార్ సాంగ్ ని రాధే లో రీమేక్ చేశారు సల్మాన్. సమ్మర్ లో రిలీజ్ అయిన సీటీ మార్ సాంగ్ హిట్ తో నీ పాట వల్ల నా పాటకి ఇంత క్రేజ్ వచ్చింది అంటూ సల్మాన్, బన్నీకి సోషల్ మీడియాలో థాంక్యూ మెసేజ్ కూడా పెట్టారు. ఇలా కనెక్ట్ అయిన బన్నీ కోసం సల్మాన్ ప్రమోషన్స్ లో జాయిన్ అవుతున్నారని ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు ఫ్యాన్స్.