Thimmarusu : ‘నువ్వు వాలి అయితే.. నేను దండేసి దండించే రాముణ్ణి’.. తారక్ వదిలిన ట్రైలర్ అదిరిందిగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘తిమ్మరుసు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

10TV Telugu News

Thimmarusu: ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ వంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’ – ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ‘టాక్సీవాలా’ ఫేం ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌‌. శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్‌లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ల మీద మహేష్ కోనేరు, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు.

Thimmarusu

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ఆకట్టుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘తిమ్మరుసు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పాటు సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. సత్యదేవ్‌ పవర్‌ఫుల్ లాయర్‌ క్యారెక్టర్‌లో చక్కగా నటించాడు. అతను ఎమోషన్స్ క్యారీ చేసిన విధానం బాగుంది.

ఎనిమిది సంవత్సరాల క్రితం క్లోజ్ చేసిన, మిస్టరీగా డమిగిలిపోయిన కేసును రీ ఓపెన్ చేసిన హీరోకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, వాటిని ఎలా సాల్వ్ చేశాడు అనే ఆసక్తికరమైన పాయింట్‌తో, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ‘లాయర్ కొడితే లైఫ్ అంతా రీ సైండే’.. ‘నువ్వు వాలి అయితే నేను దండేసి దండించే రాముణ్ణి’.. వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అప్పు ప్రభాకర్ విజువల్స్, శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. జూలై 30న ‘తిమ్మరుసు’ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

10TV Telugu News