ఎవడేమనుకుంటే నాకేంటి : ‘తిప్పరామీసం’ – ట్రైలర్

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తిప్పరామీసం’ యేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 6, 2019 / 08:31 AM IST
ఎవడేమనుకుంటే నాకేంటి : ‘తిప్పరామీసం’ – ట్రైలర్

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తిప్పరామీసం’ యేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‘తిప్పరామీసం’. రిజ్వాన్ నిర్మించగా, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్ట్ చేసిన ‘తిప్పరామీసం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.. శ్రీవిష్ణు మణి అనే డీజేగా కనిపించనున్నాడు.. అయిదు సంవత్సరాల వ్యవధిలో జరిగే కథ ఇది..

జీవితం పట్ల సీరియస్‌నెస్ లేని ఓ కుర్రాడు తన తల్లి కోసం మారాల్సి వస్తే ఏం చేశాడు అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీవిష్ణు వివిధ గెటప్స్‌లో కనిపించనున్నాడు.. మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించనున్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

Read Also : అమ్రిష్ పురి మనవడు హీరోగా ‘యే సాలీ ఆషికీ’ : ఈ నెల 22న విడుదల

 ఇటీవల సెన్సార్ పనులు పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది.‘తిప్పరామీసం’ నవంబర్ 8న ప్రేక్షకల ముందుకు రానుంది. సమర్పణ : శ్రీఓమ్ సినిమా, కెవీఎల్పీ ప్రొడక్షన్స్, సంగీతం : సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్స్ : ఖుషి, అచ్యుత్ రామారావు.