‘తిప్పరామీసం’ – సెన్సార్ పూర్తి

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన ‘తిప్పరామీసం’ సెన్సార్ పూర్తి.. నవంబర్ 8న గ్రాండ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : November 4, 2019 / 10:16 AM IST
‘తిప్పరామీసం’ – సెన్సార్ పూర్తి

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన ‘తిప్పరామీసం’ సెన్సార్ పూర్తి.. నవంబర్ 8న గ్రాండ్ రిలీజ్..

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా నటించిన సినిమా ‘తిప్పరామీసం’. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మించగా, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్ట్ చేసిన ‘తిప్పరామీసం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నవంబర్ 3న హైదరాబాద్ దసపల్ల హోటల్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నారా రోహిత్, ప్రముఖ నిర్మాత యం‌.యల్ కుమార్ చౌదరి, హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ నిక్కి తంబోలి, దర్శకుడు కృష్ణవిజయ్.ఎల్, నటులు బెనర్జీ, రోహిణి, రవిప్రకాష్, రవివర్మ, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఎడిటర్ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి తదితరులు పాల్గొన్నారు.. తొలి టిక్కెట్‌ని వినాయక్, నారా రోహిత్ కొనుగోలు చేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.

Read Also : ‘పానిపట్’ క్యారెక్టర్స్ లుక్స్ చూశారా!

రీసెంట్‌గా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీమ్ ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది.‘తిప్పరామీసం’ నవంబర్ 8న ప్రేక్షకల ముందుకు రానుంది. సమర్పణ : శ్రీఓమ్ సినిమా, కెవిఎల్‌పి ప్రొడక్షన్స్, సంగీతం : సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్స్ : ఖుషి, అచ్యుత్ రామారావు.