Chiranjeevi : ముచ్చటగా మూడో సారి.. జగన్ చిరు భేటీ.. సినీ పరిశ్రమకి లాభం చేకూరిందా??

 కరోనా వచ్చిన తర్వాత నుంచి దాసరి నారాయణరావు లేకపోవడంతో తనంతట తానే ముందుకి వచ్చి సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి పరిశ్రమ కోసం మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రెండు రాష్ట్రాల...........

Chiranjeevi :  ముచ్చటగా మూడో సారి.. జగన్ చిరు భేటీ.. సినీ పరిశ్రమకి లాభం చేకూరిందా??

Chiru Jagan

Chiranjeevi :   కరోనా వచ్చిన తర్వాత నుంచి దాసరి నారాయణరావు లేకపోవడంతో తనంతట తానే ముందుకి వచ్చి సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి పరిశ్రమ కోసం మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి సినీ సమస్యల్ని వివరించారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో కూడా వెళ్లి ఏపీ సీఎంని కలిశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై తీసుకున్న నిర్ణయంపై ట్వీట్ కూడా చేశారు. తాజాగా ఇవాళ జగన్ తో మరోసారి సినీ సమస్యలపై చర్చించడానికి వెళ్లారు చిరంజీవి.

మొదటి సారి 14 అక్టోబర్ 2019న చిరంజీవి తన సతీమణితో కలిసి ఏపీ సీఎం జగన్ ని కలిశారు. అప్పుడు ఏపీలో సినీ షూటింగ్స్ కి పర్మిషన్స్ త్వరగా కల్పించాలని, సినిమాలకి సంబందించిన అవార్డుల ఫంక్షన్స్ ప్రభుత్వం తరపున చేయాలనీ, ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై మాట్లాడారు. అప్పుడు వాటికి జగన్ సానుకూలంగా స్పందించారు. మంత్రి పేర్ని నాని కూడా ఈ విషయాన్ని మీడియాతో తెలిపారు. అయితే ఆ తర్వాత సినిమా షూటింగ్స్ కి పర్మిషన్స్ త్వరగా ఇచ్చినా అవార్డుల కార్యక్రమం మాత్రం నిర్వహించలేదు.

Chiranjeevi : సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులతో చిరంజీవి సమావేశం??

ఆ తర్వాత కరోనా వచ్చి సినీ పరిశ్రమ కష్టాల్లో ఉండటంతో చిరంజీవి, నాగార్జున, మరి కొంతమంది సినీ పెద్దలు 9 జూన్ 2020న మళ్ళీ ఏపీ సీఎం జగన్ ని కలిసి కరోనా వల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయిందని, థియేటర్ల కరెంట్ బిల్లుల గురించి, షూటింగ్స్ గురించి, థియేటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీ గురించి మాట్లాడారు. వీటిపై కూడా ఆ సమయంలో సానుకూలంగానే స్పందించారు జగన్.

Chiranjeevi : ఇండస్ట్రీలో ఎవరు పడితే వాళ్ళు ఇష్టమొచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వకండి..

ఇక ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని బాగా తగ్గిస్తూ, అలాగే సినిమా టికెట్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు జరగాలని జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు, థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు అందరూ వ్యతిరేకిస్తూ మాట్లాడారు. గత రెండు నెలలుగా ఈ సమస్య సాగుతూనే ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడే టికెట్ల అమ్మకాలలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వమే టికెట్స్ అమ్మే విషయాన్నీ సమర్థిస్తూ, టికెట్ రేట్ల ధరల్ని మాత్రం వ్యతిరేకిస్తూ మరోసారి టికెట్ రేట్ల విషయంలో ఆలోచించాలి అని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక ఈ విషయంలో సినీ పరిశ్రమ వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటంతో ఇవాళ మళ్ళీ జగన్ ని కలిశారు.

Chiranjeevi : ముగిసిన మెగా భేటీ.. టికెట్ల వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా?

ఇవాళ జగన్ ని కలిసి సినిమా టికెట్ రేట్లని పెంచాలని, గతంలో లాగానే ఉంచాలని, అలాగే చిన్న సినిమాలకి అయిదవ షోకి కూడా అనుమతి ఇవ్వాలని,అలాగే సినీ పరిశ్రమలపై, ఏపీలో థియేటర్ల సమస్యలపై, ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై మాట్లాడారు. అయితే జగన్ వీటికి సానుకూలంగా స్పందించారని మీడియాతో తెలిపారు చిరంజీవి. మరి వీటిపై ఈ సారి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జగన్ సినీ పరిశ్రమకి, థియేటర్స్ కి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. ఈ నెలాఖరు లోపు దీనిపై తుది నిర్ణయం రానుంది.