New Film Releases: మూడో గండం.. భారీ సినిమాలకు ఒమిక్రాన్ వర్రీ! Third wave.. Omicron Worry For New Film Releases

New Film Releases: మూడో గండం.. భారీ సినిమాలకు ఒమిక్రాన్ వర్రీ!

అఖండ సక్సెస్ తో టాలీవుడ్, సూర్యవన్షీ సక్సెస్ తో బాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నాయి. అంతేకాదు.. ఆడియన్స్ కి కూడా ఇప్పుడిప్పుడే ధియేటర్లకు రావడంతో రిలీజ్ కు రెడీగా..

New Film Releases: మూడో గండం.. భారీ సినిమాలకు ఒమిక్రాన్ వర్రీ!

New Film Releases: అఖండ సక్సెస్ తో టాలీవుడ్, సూర్యవన్షీ సక్సెస్ తో బాలీవుడ్ ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నాయి. అంతేకాదు.. ఆడియన్స్ కి కూడా ఇప్పుడిప్పుడే ధియేటర్లకు రావడంతో రిలీజ్ కు రెడీ గా ఉన్న సినిమాల విషయంలో ధైర్యంగా ముందుకొస్తున్నాయి. వరుస సినిమా రిలీజ్ లతో ఇక సినిమా ఇండస్ట్రీ ట్రాక్ లో పడ్డట్టే అని అనుకునేలోపే మూడోగండం ముంచుకొస్తోందని టెన్షన్ పడుతున్నారు. కరోనా పీడ విరగడైపోయిందని ఆనందం ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం లేదు. అఖండ అంత పెద్ద సక్సెస్ అయినా.. సూర్యవన్షీ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయినా సినిమా ఇండస్ట్రీకి సినిమా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

Pushpa: బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్‌గా పుష్ప!

ఇప్పుడిప్పుడే మంచి కలెక్షన్లతో సినిమా ఇండస్ట్రీ కోలుకుంటోందని అనుకునే లోపే ..కరోనా థర్డ్ వేవ్ లా వస్తున్న ఒమిక్రాన్ ఇండస్ట్రీని టెన్సన్ పెడుతోంది. ఇప్పటికే విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులతో అలర్ట్ అయిన సినిమా ఇండస్ట్రీ మరిన్ని ప్రికాషన్స్ తో షూట్స్ చేస్తున్నారు. అయితే రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల విషయంలోనే అసలు టెన్షన్అంతా. ఇంకా హై అలర్ట్ ఇచ్చేలోపే ఈ నెల సినిమాలన్నీ రిలీజ్ అయ్యి సేఫ్ అయిపోతాయి. అసలు సమస్యంతా జనవరి సినిమాల రిలీజ్ విషయంలోనే. కొత్త సంత్సరాన్ని పెద్ద సినిమా రిలీజ్ లతో గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకున్న సినిమా ఇండస్ట్రీ ఒమిక్రాన్ తో భయపడుతోంది. జనవరి7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది ట్రిపుల్ ఆర్ సినిమా. ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా కేసులు ఎక్కువవడంతో రిలీజ్ మీద, కలెక్షన్ల మీద గ్యారంటీ గా ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఉంటుందని భయపడుతున్నారు ట్రిపుల్ ఆర్ టీమ్.

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ ఇప్పటికి మూడు సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుని జనవరి రేస్ లో ఫస్ట్ వద్దామని డిసైడ్ అయ్యింది. దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన ట్రిపుల్ మూవీ బాలీవుడ్ లో ఆలియా భట్, అజయ్ దేవ్ గన్ లాంటి స్టార్ కాస్ట్ తో పాటు.. హాలీవుడ్ నుంచి కూడా అదే రేంజ్ స్టార్స్ తో తెరకెక్కించారు. సో పాన్ ఇండియా కంటే పెద్ద రేంజ్ లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ 2 వేల కోట్లకు పైగా కలెక్షన్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నంత ఫాస్ట్ గా ఒమిక్రాన్ కేసులు పెరిగితే సినిమా కలెక్షన్ల సంగతి తర్వాత.. అసలు రిలీజ్ కే మోసం వస్తుందేమో అని వర్రీ అవుతున్నారు.

Bigg Boss 5: నా నెత్తి మీద ఎక్కకు సిరి వెళ్ళిపో.. షణ్ముఖ్ ఫైర్ విత్ ఫైర్!

జనవరి 7న ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత అదే రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సినిమా భీమ్లానాయక్. ఎట్టి పరిస్తితుల్లో సంక్రాంతి సీజన్ లోనే సినిమా రిలీజ్ చెయ్యాలని పట్టుబట్టి ఇంకా షూటింగ్ చేస్తూ.. జనవరి 12న ధియేటర్లోకి వస్తామని చెప్పిన భీమ్లా నాయక్ కూడా ఇదే టెన్షన్ ఫేస్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికేవిపరీతమైన హైప్స్ క్రియేట్ చేసింది. దాంతో పాటు టీమ్ లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులతో మళ్లీ ధియేటర్లు క్లోజ్ చేసే పరిస్తితి వస్తే ఎలా అని ఒక పక్క భయపడుతూనే ఉన్నారు యూనిట్.

RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!

జనవరి రిలీజ్ లో మరో పెద్ద మూవీ రాధేశ్యామ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా మరో మూవీని ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సంవత్సరం నుంచి హోల్డ్ లో ఉన్న రాధేశ్యామ్.. ఫైనల్లీ రిలీజ్ అవుతోందని ఆనందపడాలో.. వరసగా మూడోసారి కూడా కరోనా వేవ్ సెగ తగుల్తుందేమో అని వర్రీ అవ్వాలో తెలీని కన్ ఫ్యూజన్ లో ఉన్నారు టీమ్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న సినిమా రాధేశ్యామ్. 2018లో మొదలైన ఈ సినిమా 2022 జనవరి 14న రిలీజ్ అవుతోంది. అయితే రిలీజ్ సందడి కంటే ముందు పెరుగుతున్న కోవిడ్ కేసులతో టెన్షన పడుతున్నారు టీమ్.

Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!

సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులు టైమ్ ఉండడంతో ఈలోపు ఒమిక్రాన్ స్పీడప్ అయితే ఇప్పటికే అలర్ట్ లో ఉన్న గవర్నమెంట్స్ మరోసారి ధియేటర్లకు ఆంక్షలు విధిస్తే సినిమా పరిస్తితి ఏంటని తెగ వర్రీ అవుతున్నారు టీమ్. టాలీవుడ్ కి సంబందించి సంక్రాంతి పండగ వరకూ ఒమిక్రాన్ వేవ్ పెద్దగా లేకపోతే.. జనవరి పెద్ద సినిమాలన్నీ సేఫ్ అయిపోయినట్టే. కానీ బాలీవుడ్ లో మాత్రం సిచ్యువేషన్ వేరే. జనవరి 21 నుంచి బాలీవుడ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. జనవరి 21న అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ మూవీ పృధ్విరాజ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకున్న ఈసినిమా జనవరిలో సేఫ్ గా లాండ్ అవుదామనుకుంటోంది. కానీ అంతలోనే ఒమిక్రాన్ మరోసారి రిలీజ్ విషయంలో అడ్డుపడేలా కనిపిస్తోంది.

Pushpa: గెట్ రెడీ.. మరో సాంగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ముహూర్తం ఫిక్స్!

జనవరిలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాక సేఫ్ గా రిపబ్లిక్ రోజు ధియేటర్లోకి వద్దామని డిసైడ్ అయిన హీరో , సామాన్యుడు సినిమాల్ని కూడా థర్డ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. అంతేకాదు ..జనవరి 26 నే జాన్ అబ్రహం మరో యాక్షన్ మూవీ ఎటాక్ కూడా రిలీజ్ అవుతోంది. చాలా కాలం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేసి ఇప్పుడిప్పుడే వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాల్ని మళ్లీ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుండడంతో ..మరోసారి కలెక్షన్లు డ్రాప్ అవుతాయేమో, థియేటర్లు క్లోజ్ అవుతాయేమో అసలు సినిమాలే పోస్ట్ పోన్ అవుతాయేమో అని టెన్షన్ పడుతున్నారు ఇండస్ట్రీ జనాలు.

×