ఆకట్టుకుంటున్న తిరుమణన్ ట్రైలర్

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న తిరుమణన్ ట్రైలర్ రిలీజ్.

10TV Telugu News

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న తిరుమణన్ ట్రైలర్ రిలీజ్.

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు చేరన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, డైరెక్ట్ చేసిన సినిమా తిరుమణన్.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. ఒక మధ్యతరగతి అన్న, తన చెల్లి పెళ్ళి చెయ్యడానికి ఎన్ని కష్టాలు పడతాడో ట్రైలర్‌లో చాలా బాగా చూపించాడు చేరన్. సాధారణంగా పెళ్ళి సంబంధం ఫిక్స్ అయ్యాక జరిగే హడావిడి, అలకలు, అంతస్థులు, హంగామా వంటివన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సుకన్య, కావ్య సురేష్, ఉమాపతి రామయ్య, తంబి రామయ్య, జయ ప్రకాష్, మనోబాల తదితరులు నటిస్తున్న తిరుమణన్ త్వరలో రిలీజ్ కానుంది. 

ఈ సినిమాకి కెమెరా : రాజేష్ యాదవ్, ఎడిటింగ్ : పొన్నువేల్ దామోదరన్, సంగీతం : సిద్ధార్థ్ విపిన్, లిరిక్స్ : యుగభారతి, లలితానంద్ అండ్ చేరన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బెంజిమన్, నిర్మాణం : ప్రెనిస్ ఇంటర్ నేషనల్ ప్రై.లి, రచన-దర్శకత్వం : చేరన్.

వాచ్ ట్రైలర్…