Priyanka Chopra, Kim Kardashian ఫేవరేట్ స్కిన్ కేర్ ప్రొడెక్ట్ రూ.500. డ్రై స్కిన్ కోసం మీరూ వాడతారా?

  • Published By: sreehari ,Published On : September 8, 2020 / 07:25 PM IST
Priyanka Chopra, Kim Kardashian ఫేవరేట్ స్కిన్ కేర్ ప్రొడెక్ట్ రూ.500. డ్రై స్కిన్ కోసం మీరూ వాడతారా?

Most favorite Skincare product of Priyanka Chopra And Kim Kardashian West : బాలీవుడ్ అందాల భామలు ప్రియాంక చోప్రా, కిమ్ కర్దషియస్ వెస్ట్ తమ చర్మ సౌందర్యం వెనుక సీక్రెట్ చెప్పేశారు.. కేవలం రూ.500 లోపు ధర ఉండే స్కీన్ కేర్ ప్రొడక్ట్ తమ అందానికి కారణమంటున్నారు.. పొడిచర్మానికి ఈ స్కీన్ కేర్ ప్రొడక్టు అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.. మీరు కూడా మీ డ్రై స్కిన్ కోసం ఈ స్కీన్ ప్రొడక్ట్ ట్రై చేయాలనుకుంటే మాత్రం Bio-Oil 60ml బాటిల్ ధర రూ.450 మాత్రమేనంట..



ఈ ఆయిల్ రాసుకుంటే చాలు.. చర్మం దగదగ మెరిసిపోతుందంట.. ఈ ఆయిల్ రాసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను Kardashian West తన బ్లాగ్ పోస్టులో రాసుకొచ్చింది. మీ చర్మంపై చారికలు లేదా గీసుకున్న మచ్చలు ఉంటే.. ఈ ఆయిల్ ఆయా ప్రాంతంలో రోజుకు రోజు సార్లు చొప్పున అప్లయ్ చేయాలని చెబుతోంది. ప్రియాంక చోప్రా.. ఈ Bio-Oil ప్రొడక్టును మ్యాజికల్ ప్రొడక్టుగా తెలిపింది. ఇది నమ్మలేకపోతున్నాను.. మీ పొడి చర్మాన్ని వెంటనే కోమలమైన చర్మంగా మార్చేస్తుందని 2018లో ఓ ఇంటర్వ్యూలో చోప్రా తెలిపింది.



రాత్రి సమయంలో తన శరీరమంతా ఈ ఆయిల్ రాసుకుంటానని చెప్పింది. ప్రెగ్నెన్సీ సమయంలోనూ ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుందని తన అభిమానులకు షేర్ చేసింది. ఇందులో PurCellin అనే మూలిక ఉందని.. మీ చర్మాన్ని డిహైడ్రేట్ నుంచి కాపాడుతుందని, తేమను కోల్పోకుండా రంగు మారకుండా రక్షిస్తుందని చెప్పుకొచ్చింది.



మరికొంతమంది సెలబ్రిటీల ఫ్యాన్స్ కూడా తమ ముఖానికి ఈ ఆయిల్ వాడుతున్నారంట.. Kourtney Kardashian కూడా తన కళ్లు చుట్టే ఏర్పడే వలయాలతో పాటు పొడిగా లేకుండా ఉండేలా ఆయిల్ అప్లయ్ చేస్తోంది.. ఎన్ని రకాల చర్మం కలిగినవారికైనా ఈ Bio Oil అద్భుతంగా పనిచేస్తుందని చోప్రా తెలిపింది.