బాలీవుడ్ బాద్షా షారూఖ్ సంపాదన సంవత్సరానికి రూ.125కోట్లు!!
షారూఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్ షా అనడంలో ఎలాంటి సందేహం లేదు. 28సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న షారూఖ్ అభిమానుల్లో కానీ ఛార్మింగ్ లోని ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ అతని సక్సెస్ స్టోరీ చాలామందికి ఎంకరేజ్ మెంట్ గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న రిచెస్ట్ పర్సన్స్ లో షారూఖ్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఫోర్బ్స్ 2019లెక్కల ప్రకారం.. సంవత్సరానికి రూ.124.38కోట్లు సంపాదిస్తున్నాడు.
ఢిల్లీ నుంచి వచ్చిన షారూఖ్ ఏడాది ఆదాయం రూ.125కోట్లు ఎలా.. టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన షారూఖ్ 1992లో దివానా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు. విలన్ క్యారెక్టర్ల నుంచి వచ్చి కింగ్ రొమాన్స్ గా నిలిచిన షారూఖ్.. 80సినిమాల వరకూ నటించాడు. కింగ్ ఖాన్ SRK పేరిట సొంత సినిమా నిర్మాణ సంస్థ గోల్డెన్ బెంచ్ మార్క్ దక్కించుకుంది.
షారూఖ్ చివరి సినిమా ZERO(2018)కు రూ.200 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే వచ్చింది రూ.185కోట్లు మాత్రమే. 2019లో ఈ స్టార్ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఇక ఈ సంవత్సరం ఎలాగూ రెడ్ చిల్లీ ప్రొడక్షన్స్ పేరిట ఓటీటీ ప్లాట్ ఫాం సెట్ చేశారు. షారూఖ్ నెట్ ఫ్లిక్స్ లో రెండు ప్రాజెక్టులు నడిపిస్తున్నాు. బర్ద్ ఆఫ్ బ్లడ్, బేతాల్ అండ్ కామ్యాబ్. షారూఖ్ నిర్మించిన బద్లాలో తాప్సీ పన్ను నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.100కోట్లు వసూలు చేసింది. ఈ నిర్మాణ సంస్థకు సంవత్సర ఆధాయం రూ.500కోట్లు.
టీవీ షోలు ఫౌజీ, సర్కస్ ల ద్వారా టీవీ పరిశ్రమకు పరిచయమైన షారూఖ్ ఇటీవల కౌన్ బనేగా కరోర్ పతి-సీజన్ 3, క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై, జోర్ కా జట్కా, టోటల్ వైప్ అవుట్ షోలలో కనిపించారు. ఖాన్ ఒక్కో ఎపిసోడ్ కు వసూలు చేసిందెంతో తెలుసా రూ.2.5కోట్లు.
బ్రాండ్ అంబాసిడర్ గానూ షారూఖ్ సంపాదిస్తుంటారు. ఇలా 14బ్రాండ్లకు షారూఖ్ అంబాసిడర్. ఐసీఐసీఐ, బిజూస్, బిగ్ బాస్కెట్, ట్యాగ్ హ్యుయర్, లక్స్, హ్యుండాయ్ లాంటి టాప్ బ్రాండ్లకు కూడా. ఒక్కో యాడ్ షూట్ కు షారూఖ్ తీసుకునేది రూ.3.5 నుంచి రూ.4కోట్లు.
షారూఖ్ కు డబ్బుతెచ్చే ఇతర పెట్టుబడులు
వెడ్డింగ్ ఫంక్షన్లలోనూ షారూఖ్ కనిపిస్తారట అది కూడా 4నుంచి రూ.8కోట్ల మధ్యలో తీసుకుని.. కిడ్జానియా, బిజూస్ లలోనూ వాటాదారుడిగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ యజమాని కూడా. కేకేఆర్ జెర్సీ మీద ఎవరైనా స్పాన్సర్ తమ లోగో వేసుకోవాలంటే 8 నుంచి రూ.12కోట్ల వరకూ వసూలు చేస్తారట.
ఇవే కాకుండా ముంబైలోని బాంద్రాలో రూ.200కోట్ల విలువ చేసే బంగ్లా.. అలీబాగ్ లో రూ.15కోట్ల విలువ చేసే హాలీడే హోం ఉన్నాయి. దుబాయ్ లోనూ చాలా కొద్ది మంది స్టార్లకు మాత్రమే ఉండే ప్రాంతంలో పాల్మ్ జుమేరియా అనే ప్రాంతంలో విల్లా కూడా ఉంది. దాని విలువ దాదాపు రూ.18కోట్లు.
అతని వద్ద కోట్ల విలువ చేసే కార్లు.. రాయల్టీని చూపించే బస్సులు ఇలా అత్యంత లగ్జరీ సామాను మొత్తం షారూఖ్ సొంతం.