RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

సినిమా అంటే ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ అంటే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్.. ఇదీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల టాక్.

RRR: చరణ్-తారక్ లలో రాజమౌళికి ఇష్టమైన పాత్ర ఇదే!

Rrr

RRR: సినిమా అంటే ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ అంటే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్.. ఇదీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల టాక్. ఈ సినిమా కోసం కోట్లాది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా వచ్చేస్తున్నాం అని ఊరించిన కరోనా మహమ్మారి విజృంభణతో అది కాస్త వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రమోషన్ల మోత మోగించినా ప్రయోజనం లేకుండా పోయింది.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

కాగా.. కరోనా ప్రస్తుతం ఉదృతంగా వ్యాపిస్తున్నా వచ్చే నెలలో తగ్గుముఖం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే మార్చి 18 లేదా ఏప్రిల్ 29నే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేసేందుకు జక్కన్న అండ్ టీం ఫిక్స్ అయినట్లుగా అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో మరోసారి మళ్ళీ ఆర్ఆర్ఆర్ టాక్ మళ్ళీ ఊపందుకుంది. దీంతో ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరి పాత్రకి ప్రాధాన్యత ఉంటుందన్న టాక్ నడుస్తుంది.

Telugu Dubbing Films: బాలీవుడ్ స్క్రీన్స్‌పై తెలుగు డబ్బింగ్ సినిమాల దాడి!

దీనికి కారణం కూడా దర్శకుడు రాజమౌళినే. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి ఇద్దరు హీరోలలో ఎవరి పాత్ర మీకు ఇష్టమనే ప్రశ్నకి.. రామ్ చరణ్ అల్లూరి పాత్ర అంటే ఇష్టమని చెప్పేశాడు. సినిమాలో ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఉంటుందంటూనే.. రామ్ చరణ్ పాత్ర తనకి వ్యక్తిగతంగా ఇష్టమని చెప్పాడు. దీంతో ఇప్పుడు రాజమౌళి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.