Bigg Boss OTT Telugu: 8 మంది కొత్త కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే!

మరోసారి తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఈసారి నాన్ స్టాప్ ఎంటెర్టైన్మెంట్ ఇస్తామంటూ ఇప్పటికే..

Bigg Boss OTT Telugu: 8 మంది కొత్త కంటెస్టెంట్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Bigg Boss Ott Telugu (1)

Bigg Boss OTT Telugu: మరోసారి తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ సందడి మొదలైంది. ఈసారి నాన్ స్టాప్ ఎంటెర్టైన్మెంట్ ఇస్తామంటూ ఇప్పటికే 17 మంది కంటెస్టెంట్లు ఇంట్లోకి వెళ్లారు. వాళ్ళలో కొందరు పాతవాళ్లే కాగా కొత్తగా.. అజయ్‌ కాతువాయూర్‌, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, శ్రీరాపాక, మోడల్ అనిల్, మిత్ర శర్మ, యాంకర్‌ శివ, బిందుమాధవి చాలెంజర్లుగా కొత్తగా హౌస్ లో అడుగు పెట్టారు.

వీరిలో అజయ్‌ కాతువాయూర్‌ పేరుకు రెండు సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఇప్పుడు తనే దర్శకుడిగా మారి ఓ కొత్త సినిమా కూడా చేస్తున్నాడు అజయ్‌. ఇంతలో ఇలా బిగ్ బాస్ ఆఫర్ తలుపు తట్టినట్లుగా ఉంది. ఇక మరో కంటెస్టెంట్ యాంకర్‌ స్రవంతి చొక్కారపు సోషల్‌ మీడియాలో మాత్రమే తెలిసిన పర్సనాలిటీ కాగా.. ఆర్జే చైతూ, శ్రీరాపాక, బిందుమాధవి కూడా బాగా ప్రేక్షకులకు తెలిసిన వాళ్ళే.. విన్న పేర్లే.

ఇక మోడల్ అనిల్ ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేదు. తండ్రి, తాత కూడా పోలీసాఫీసర్‌ కానీ అనిల్‌ మాత్రం మోడలింగ్‌ వైపు అడుగులు వేసి తక్కువ కాలంలో బెస్ట్‌ మోడల్‌గా అవార్డులు అందుకున్నాడు. బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం అనిల్ కొత్త. తొలి సంధ్య వేళలో’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన మిత్ర శర్మ.. ఆ తర్వాత ముంబై నుంచి హైదరాబాద్‌లో సెటిల్‌ అయి శ్రీ పిక్చర్స్‌ బ్యానర్‌ స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తుంది. ఇక యాంకర్ శివ గురించి చెప్పాలంటే వివాదాస్పద ఇంటర్వ్యూలతోనే సెన్సేషనల్‌ అయ్యాడనే చెప్పుకోవాలి. మరి పాత వాళ్ళతో వీళ్ళు ఎలా కలిసి హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో చూడాలి.