Radhe Shyam: ప్రపంచంలోనే తొలి సినిమా ఇదే.. డైరెక్టర్ రాధాకృష్ణ

సమ్మర్ సీజన్ లో మార్చి 11న వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్లకు పైగా రిలీజ్ కానున్న సినిమా రాధేశ్యామ్. రెబల్ స్టార్ ప్రభాస్ కూల్ స్టార్ గా మారి నటించిన సినిమా కాగా.. రిలీజ్

Radhe Shyam: ప్రపంచంలోనే తొలి సినిమా ఇదే.. డైరెక్టర్ రాధాకృష్ణ

Radhe Shyam

Radhe Shyam: సమ్మర్ సీజన్ లో మార్చి 11న వరల్డ్ వైడ్ గా 10వేల థియేటర్లకు పైగా రిలీజ్ కానున్న సినిమా రాధేశ్యామ్. రెబల్ స్టార్ ప్రభాస్ కూల్ స్టార్ గా మారి నటించిన సినిమా కాగా.. రిలీజ్ దగ్గరపడుతున్న క్రమంలో యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ముందుగా సోషల్ మీడియా నుండి యూట్యూబ్ ఛానెళ్ల వరకు దర్శకుడు రాధాకృష్ణ పలు ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన దర్శకుడు రాధాకృష్ణ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Radhe Shyam: ఈ రాతలే వీడియో సాంగ్.. ఈ ఐదు అంశాలు గమనించారా?

రాధేశ్యామ్ స్టోరీ చెప్పిన వెంట‌నే అందులో ఉన్న మెయిన్ పాయింట్ కి ప్ర‌భాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారని.. త‌న పోషిస్తున్న విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఉన్న విభిన్న షేడ్స్ విష‌యంలో ప్ర‌భాస్ గారు చాలా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి న‌టించారని రాధాకృష్ణ చెప్పాడు. నిజానికి రాధేశ్యామ్ స్టోరీని నేను ముందు ఇండియాలోని ఓ హిల్ స్టేష‌న్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామ‌నుకున్నా కానీ ప్ర‌భాస్ గారు ఇచ్చిన సూచ‌న‌ల‌తో ఇట‌లీ బ్యాక్ డ్రాప్ కి మార్చానని.. అదే ఇప్పుడు ఈ సినిమాకు మెయిన్ విజువ‌ల్ ఎస్సెట్ గా మారిందని చెప్పాడు.

Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడ్ పెంచడయ్యా.. మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!

కోవిడ్ కి ముందు ఇట‌లీ, ఇత‌ర యూర‌ప్ దేశాల్లో షూట్ చేయగా.. కోవిడ్ కార‌ణంగా వ‌చ్చిన ఆంక్ష‌లుతో ఇట‌లీని హైద‌రాబాద్ కి షిఫ్ట్ చేశామనేతంగా భారీ సెట్స్ మ‌ధ్య రాధేశ్యామ్ షూటింగ్ జ‌రిగిందని చెప్పాడు. జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్ గా ఓ విష‌యాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్ గా మారుతుందని చెప్పాడు. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్ లో ప్ర‌భాస్ నటించగా.. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న సినిమా ఇదేనని చెప్పారు.

Radhe Shyam Glimpse: ఇంతమంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు!

ఇక, సినిమా ప్రమోషన్స్ గురించి చెప్పిన రాధాకృష్ణ.. దేశాల ప్ర‌భుత్వాల‌నే మార్చేసెంత శ‌క్తిగా సోషల్ మీడియా త‌యారైందని.. అన్ని చిత్రాల ప్ర‌మోష‌న్స్ కి మీడియాతో పాటు సోష‌ల్ మీడియా అవ‌స‌రమని చెప్పాడు. రాధేశ్యామ్ ని థ‌మ‌న్ త‌న అద్భుత‌మైన రీరాక్డింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నెక్ట్స్ లెవ‌ల్ కి తీసుకెళ్లారని.. ప్ర‌భాస్, పూజా హెగ్దేల జంట చాలా చూడ‌ముచ్చ‌ట‌గా.. రొమాంటిక్ గా ఉండ‌నుందని, రాధేశ్యామ్ లో మెజార్టీ విఎఫ్ ఎక్స్ వ‌ర్క్స్ ఉక్రేయిన్ లోనే చేయించామని.. అన్ని స‌కాలంలోనే పూర్తి చేశామని చెప్పారు.