MAA Elections: మంచు విష్ణు ప్యానెల్ ఇదే.. హీట్ పెంచేస్తున్న మా ఎలక్షన్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 956 మంది సభ్యులున్న సంఘానికి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడనున్నట్లు..

MAA Elections: మంచు విష్ణు ప్యానెల్ ఇదే.. హీట్ పెంచేస్తున్న మా ఎలక్షన్!

Maa Elections (1)

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 956 మంది సభ్యులున్న సంఘానికి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడనున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు మా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎవరికి వారు ఓట్లు తమకే పడేలా తెర వెనుక మంతనాలు జరుపుతున్నారు. ఇందులో ఐదుగురు పోటీలో ఉన్నా.. ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్యే ప్రధానంగా పోరు సాగనుంది.

Big Boss 5 Tamil: ఐదవ సీజన్ ముహూర్తం ఖరారు.. హోస్ట్ మళ్ళీ లోకనాయకుడే!

ప్రకాష్‌ రాజ్‌ ఇప్పటికే గత నెలలోనే తన ప్యానెల్‌ ని ప్రకటించి సినీ ఇండస్ట్రీలో హీట్ పెంచిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటనతోనే మొదలైన ఈ ఎన్నికల రచ్చ ఎన్నెన్నో మలుపులు తిరిగి త్వరలోనే ఎన్నికలు జరిగే వరకు వచ్చింది. ఇక ఇప్పుడు మరో పోటీదారు మంచు విష్ణు కూడా ప్యానెల్‌ని ప్రకటించాడు. బుధవారం తన ప్యానెల్‌తో మీటింగ్‌ నిర్వహించిన విష్ణు గురువారం తన ప్యానల్ ను ప్రకటించాడు.

Jr NTR: తాత సెంటిమెంట్.. లంబోర్ఘిని కోసం రూ.17 లక్షల నెంబర్!

మంచు విష్ణు టీమ్‌లో అధ్యక్షుడు… మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: బాబు మోహన్, వైస్ ప్రెసిడెంట్స్: పృధ్వీ, మాదాల రవి, జాయింట్ సెక్రటరీ: రఘుబాబు, సెక్రెటరీలు: కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు, కోశాధికారి: శివ బాలాజీ, కార్యవర్గ సభ్యులు: అర్చన, అశోక్ కుమార్, గీతా సింగ్, హరినాథ్ బాబు, జయ వాణి, మలక్ పేట శైలజా మానిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివ నారాయణ, శ్రీ లక్ష్మి, పసునూరి శ్రీనివాసరావు, స్వప్న మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎంఆర్సి తదితరులున్నారు.

Love Story: సెన్సిబుల్ లవ్‌స్టోరీ కోసం సిలబస్ మార్చేసిన శేఖర్ కమ్ముల

కాగా, మెగా ఫ్యామిలీ అండదండలతో ప్రకాశ్‌ రాజ్.. కృష్ణంరాజు, కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. జీవిత, హేమ మహిళా కార్డుతో పోటీకి సై అంటున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించేలా హీట్ పెంచేసిన మా ఎన్నికల వ్యవహారం ఇప్పుడు పోటాపోటీ ప్యానెళ్ల తర్వాత ఎలాంటి మలుపులు తిరిగి ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో చూడాల్సి ఉంది.