Telugu Latest Films: ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమాలివే..
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలలో మంచి అంచనాలున్న సినిమా సీటీమార్. ఓటీటీ విషయానికి వస్తే.. నానీ లాంటి స్టార్ హీరో టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్..

Telugu Latest Films
Telugu Latest Films: ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు థియేటర్లకు రావాలా.. ఓటీటీకి ఇవ్వాలా అనే సందిగ్ధంలో విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఒకే ఒక్క అప్షన్ ఓటీటీ కావడంతో అన్నీ ఆ బాటలోనే వెళ్లాయి. అనంతరం లాక్ డౌన్ ముగిసి థియేటర్లు తెరుచుకున్నా.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానంతో వేచి ఉండే ధోరణి అవలంభిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్లకు రావడంతో మిగతా సినిమాలు కూడా అదే బాటలో వస్తున్నాయి.
Prabhas 24: ప్రభాస్‌తో నటించాలని ఉందా.. అయితే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
మరికొందరు ఎందుకొచ్చిన తంటా అని మంచి డీల్ కుదిరితే ఇప్పటికీ ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. కాగా, ఈ వారం అటు ఓటీటీలో కానీ.. ఇటు థియేటర్లలో కానీ సినిమా సందడి భారీగా కనిపిస్తుంది. ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలలో మంచి అంచనాలున్న సినిమా సీటీమార్. మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటిమార్’ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కాబోతుంది.
Lahari Shari: బిగ్‌బాస్ షో ఈ సీజన్ గ్లామరస్ డాల్ లహరి
తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత కథతో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘తలైవి’ కూడా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుండగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా తెరకెక్కిన ‘లాభం’ సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదల కానుంది. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా, కంగనా తలైవి తమిళ, తెలుగు రెండు బాషలలో విడుదల కానుండగా ఈ రెండు సినిమాల మధ్య ఒకవిధమైన పోటీ వాతావరణం కనిపిస్తుంది.
Bigg Boss 5: ఎలిమినేషన్ జోన్లో ఆరుగురు.. గండం నుంచి గట్టెక్కేదెవరు?
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. నానీ లాంటి స్టార్ హీరో టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్, ఓటీటీ లవర్సుకు పండగలా మారింది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఇక రాహుల్ రామకృష్ణ, అవికాగోర్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ కథా చిత్రం ‘నెట్’ సెప్టెంబరు 10న ‘జీ5’ ఓటీటీలో ప్రసారం కానుండగా లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంగా నరసింహ నంది తెరకెక్కించిన ‘జాతీయ రహదారి’ కూడా సెప్టెంబరు 10న థియేటర్లలో విడుదల కానుంది.