డూడీ ఎంత పనిచేసింది.. రిలీజ్ డేట్ అందుకే మార్చారా?

10TV Telugu News

RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ హిస్టారికల్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’.. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందంటూ ఫిలింనగర్లో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. టీం ముందుగా చెప్పినట్టు గతేడాది జూలై 30 న విడుదల కావాల్సి ఉంది. తర్వాత ఈ ఏడాది జనవరి 8 కి షిఫ్ట్ చేశారు.

లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడం వల్ల రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేకపోయారు. ఇటీవలే క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ఐరిష్ నటి అలీసన్ డూడీ ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 8 న విడుదలవుతోందంటూ పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసింది. దీంతో అక్టోబర్ 8 ఫిక్స్ అనుకున్నారంతా.. కట్ చేస్తే అక్టోబర్ 13 విడుదల అంటూ అనౌన్స్ చేశారు.

RRR

ఇందుకు కారణం లేకపోలేదు.. అక్టోబర్ 8 న ప్రపంచ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న బాండ్ పిక్చర్ ‘నో టైమ్ టు డై’ రిలీజవుతోంది.. అంతర్జాతీయంగా బాండ్ సినిమాలకుండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దీంతో మరో నాలుగు రోజులు పొడిగిస్తూ 13 కి ఫిక్స్ అయిపోయారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ, పైగా వీఎఫ్ఎక్స్ పని చాలా ఉంటుంది.. ఇటీవలే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. అక్టోబర్ నాటికి పరిస్థితి ఇంకాస్త మెరుగుపడుతుంది.. కాబట్టి జనాలు థియేటర్లకు వస్తారనే ఆలోచనతో ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ అక్టోబర్ 13 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు..

RRR

×