BiggBoss Non Stop : ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్ లో ఎవరున్నారు??
ఈ సారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఏడోవారం నామినేషన్స్ కొత్తగా, రసవత్తరంగా ఉన్నాయి. ఎప్పటిలాగా కాకుండా ఏడోవారం నామినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా సాగాయి. ప్రతి వారం ఒక్కొక్కరు.......

BiggBoss Non Stop : ఈ సారి ఓటీటీలో అంతగా ఆదరణ లేకపోయినా బాగానే సాగుతుంది బిగ్‌బాస్ నాన్ స్టాప్. ఇక హౌస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. కొంతమంది మాములు రోజుల్లో ఎలా ఉన్నా నామినేషన్స్ రోజు మాత్రం అసలు రూపాలు బయటకి వచ్చి అందరితో గొడవ పడతారు. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకొని ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు బిగ్‌బాస్ హౌస్ నుంచి. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తవ్వగానే మళ్ళీ నామినేషన్స్ రగడ మొదలైంది.
ఈ సారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఏడోవారం నామినేషన్స్ కొత్తగా, రసవత్తరంగా ఉన్నాయి. ఎప్పటిలాగా కాకుండా ఏడోవారం నామినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా సాగాయి. ప్రతి వారం ఒక్కొక్కరు వచ్చి అనేక కారణాలతో ఇద్దర్ని లేదా ఒక్కర్ని నామినేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈవారం బిగ్‌బాస్ ఇద్దరిద్దర్ని పిలిచి వాళ్ళిద్దరిలో మాట్లాడుకొని లేదా గొడవపడి ఏం చేసి అయినా సరే వాళ్లలో ఒక్కరే నామినేట్ అవ్వాలని చెప్పారు. వీళ్ళ గొడవ పూర్తి అవ్వకపోతే బిగ్‌బాస్ ఇద్దర్ని నామినేట్ చేస్తా అని చెప్పారు.
Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?
ముందుగా హమీదా, అనీల్ ని పిలిచి వాళ్ళిద్దరిలో డిసైడ్ అవ్వమన్నారు. వీళ్లిద్దరు కాసేపు మాట్లాడుకొని, కాసేపు గొడవపడి చివరికి అనీల్ తనంతట తాను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్, యాంకర్ శివలని పిలవగా వీరిద్దరూ ఎప్పటిలాగే బాగా గొడవ పడ్డారు. వీరి గొడవ ఇంతకీ తేలకపోవడంతో బిగ్‌బాస్ ఇద్దర్ని నామినేట్ చేశాడు. ఇక నెక్స్ట్ బిందుమాధవి, అఖిల్ ని పిలువగా వీరిద్దరూ మొదటి నుంచి మంచిగా ఉన్నా ఈ నామినేషన్స్ లో మాత్రం బాగా గొడవ పడ్డారు. ఎవరు నామినేట్ అవుతారో వీరి గొడవలో తేలలేదు దీంతో ఇద్దర్ని నామినేట్ చేశాడు బిగ్‌బాస్. మరో పెయిర్ లో అరియనా నామినేట్ అయింది. చివరగా మిత్రా శర్మ, మహేష్ విట్టాలని పిలవగా వీరిద్దరూ కాసేపు కూల్ గా డిస్కషన్ చేసుకొని మిత్రా శర్మ తనంతట తానే సెల్ఫ్ నామినేట్ అయ్యింది. అయితే లాస్ట్ లో కెప్టెన్ అషు రెడ్డి వచ్చి మహేష్ ని తన కెప్టెన్సీ పవర్ తో నామినేట్ చేసింది.
Alia-Ranbir Wedding: రణబీర్‌తో అలియా పెళ్లి ఎక్కడ.. అతిధులు ఎంత మందంటే?
మొత్తానికి ఈ వారం బిగ్‌బాస్ లో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో అఖిల్, బిందుమాధవి, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, మిత్ర, అనిల్, మహేష్ విట్టా నిలిచారు. మరి ఈ నామినేషన్స్ నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.