This Week Releasing Movies : ఈ వారం థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు

నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి. 18 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ వరకు ఓ జంట ప్రేమని ఈ సినిమాలో చూపించబోతున్నారు............

This Week Releasing Movies : ఈ వారం థియేటర్లలో, ఓటీటీలలో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు

This Week Releasing telugu Movies in theaters and OTT

This Week Releasing Movies :  నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి. 18 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ వరకు ఓ జంట ప్రేమని ఈ సినిమాలో చూపించబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చ్ 17 థియేటర్స్ లోకి రానుంది. ఒక ఫీల్ గుడ్ మొవిఎలా ఈ సినిమా ఉండబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ ఒక మంచి మెలోడీ ఫీల్ ని ఇచ్చాయి ప్రేక్షకులకు.

కన్నడ సినిమా కబ్జ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. కన్నడ స్టార్ హీరోలైన ఉపేంద్ర, సుదీప్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. KGF రేంజ్ లో భారీగా ఈ సినిమాని తెరకెక్కించారు. స్వాతంత్య్రం ముందు మాఫియా లాంటి కథతో భారీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 17న పాన్ ఇండియా సినిమాగా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సార్ సినిమా ఫిబ్రవరి 17న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించి 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. చదువు గురించి మంచి మెసేజ్ తో వచ్చిన సార్ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. థియేటర్స్ లో సందడి చేసిన సర్ సినిమా మార్చ్ 17 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రానుంది.

యువ హీరో సుహాస్, టీనా జంటగా తెరకెక్కిన రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. రైటర్ పద్మభూషణ్ సినిమా జీ5 లో మార్చ్ 17 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది.

Oscars95 : గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆస్కార్ చూసిన వారి సంఖ్య 12% పెరిగింది.. కారణం అదేనా?

తెలుగు ఓటీటీ ఆహాలో జగదీశ్ ప్రదీప్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా సత్తిగాని రెండెకరాలు మార్చ్ 17 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ, సస్పెన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది.