Ugadi Movies : ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

 ఈ వారం ఉగాది ఉండటంతో మీడియం రేంజ్ సినిమాలు థియేటర్స్ కి క్యూ కట్టాయి. మార్చ్ 22 బుధవారం నాడు ఉగాది కావడంతో గురువారం, శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు బుధవారమే రిలీజ్ అవుతున్నాయి..............

Ugadi Movies : ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజయ్యే తెలుగు సినిమాలు ఇవే..

This Week theatrical and OTT releasing movies on Ugadi

Ugadi Movies :  ఈ వారం ఉగాది ఉండటంతో మీడియం రేంజ్ సినిమాలు థియేటర్స్ కి క్యూ కట్టాయి. మార్చ్ 22 బుధవారం నాడు ఉగాది కావడంతో గురువారం, శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు బుధవారమే రిలీజ్ అవుతున్నాయి.

విష్వక్సేన్, నివేత పేతురేజ్ జంటగా విశ్వక్ సొంత నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాస్ కా ధమ్కీ సినిమా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడి ఉగాదికి మార్చ్ 22న రిలీజ్ కి సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి సినిమాపై మరింత హైప్ పెంచాడు. విశ్వక్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా చేస్తున్నాడు విశ్వక్సేన్.

కృష్ణవంశీ దాదాపు ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత రంగమార్తాండ సినిమాతో రాబోతున్నాడు. మరాఠీలో మంచి విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ గా రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ, ఆదర్శ్ ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని కూడా ఉగాది నాడు మార్చ్ 22న రిలీజ్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ ఇటీవల తమిళ సినిమా ఘోస్టీతో కంబ్యాక్ ఇచ్చింది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో రిలీజయి ప్రేక్షకులని మెప్పించింది. ఇప్పుడు ఉగాది నాడు మార్చ్ 22న తెలుగులో కోస్టి పేరుతో రిలీజ్ కాబోతుంది. కాజల్ కంబ్యాక్ సినిమా కావడంతో సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి.

చిత్రశుక్ల మెయిన్ లీడ్ లో నటించిన గీత సాక్షిగా అనే ఓ చిన్న సినిమా కుడా మార్చ్ 22న ఉగాది రోజూ రిలీజ్ కాబోతుంది.

అలాగే కథ వెనుక కథ అనే మరో చిన్న సినిమా మార్చ్ 24న రిలీజ్ కాబోతుంది. సునీల్ ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించాడు.

Naga Shaurya : క్రిందటి ఉగాదికి అనౌన్స్‌మెంట్.. ఈ ఉగాదికి అప్డేట్.. నాగశౌర్య 22వ సినిమా!
……………………………………………………………….

ఇక కొన్ని తెలుగు సినిమాలు కూడా ఓటీటీలో సందడి చేయనున్నాయి.

బ్రహ్మానందం, స్వాతి, శివాత్మిక.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన పంచతంత్రం సినిమా గత సంవత్సరం డిసెంబర్ 9న థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మార్చ్ 22న ఉగాది నాడు ఈటీవి విన్ యాప్ లో రిలీజ్ కాబోతుంది.

కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఈ సినిమా ఉగాది మార్చ్ 22 నుంచి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవ్వబోతోంది.