NTR 30: కొరటాల సినిమాకు ఆ ఇద్దరూ.. ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా?

తన సినిమాల విషయంలో ప్రతి చిన్న డీటెయిల్ ని కేర్ ఫుల్ గా చూసుకునే ఎన్టీఆర్.. ఒక్క విషయంలో మాత్రం రిస్క్ చేస్తున్నారు. తెలుగులో అంతగా ట్రాక్ రికార్డ్ లేని మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్నారు.

NTR 30: కొరటాల సినిమాకు ఆ ఇద్దరూ.. ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా?

#ntr30

NTR 30: తన సినిమాల విషయంలో ప్రతి చిన్న డీటెయిల్ ని కేర్ ఫుల్ గా చూసుకునే ఎన్టీఆర్.. ఒక్క విషయంలో మాత్రం రిస్క్ చేస్తున్నారు. తెలుగులో అంతగా ట్రాక్ రికార్డ్ లేని మ్యూజిక్ డైరెక్టర్ తో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్నారు. కొరటాలతో చేస్తోన్న సినిమా విషయంలో ఎన్టీఆర్ డెసిషన్ కరెక్టేనా..? ఇంతకీ ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు.. ఇంకా ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఎక్జైటింగ్ డిటేల్స్ ని ఇప్పుడు చూసేయండి.

NTR 30 : ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా అప్డేట్ అప్పుడే.. లీక్ చేసిన కొరటాల శివ..

ఎప్పటినుంచో వాయిదాపడుతోన్న ఎన్టీఆర్30.. మే 20న ఎట్టకేలకు సెట్స్ పైకెళ్తోంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంత క్లాస్ లుక్ లో కనిపించినా.. మాస్ ఫినిషింగ్ ఉంటేనే మజా. అందుకే ఇప్పటి వరకూ తన సినిమాల దగ్గరనుంచి మ్యూజిక్ వరకూ ప్రతీదీ సేఫ్ సైడ్ లోనే ఉంటూ రిస్క్ చెయ్యలేదు. కానీ ఫస్ట్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రిస్క్ చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ఎన్టీఆర్ చెయ్యబోతున్న సినిమాకు తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఫిక్స్ అయ్యారు.

NTR: ఎన్టీఆర్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

తమిళ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా కోలీవుడ్ బిగ్ స్టార్స్ ను తన మ్యూజిక్ తో క్రేజీగా స్టెప్పులేయించాడు. కానీ టాలీవుడ్ స్ట్రైయిట్ మూవీతో సక్సెస్ కొట్టలేకపోయాడు అనిరుథ్. అయినా ఎన్టీఆర్30తో మరోసారి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్.. అరవింద సమేత సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ లాస్ట్ మినిట్ లో మిస్ అవ్వడంతో ఈ సారి అనిరుధ్ కి మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు ఎన్టీఆర్. అంతో ఇంతో క్లాస్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కే అనిరుధ్ మ్యూజిక్ సెట్ అవ్వనప్పుడు పక్కా మాస్ ఫ్యాన్స్ ఉన్న ఎన్టీఆర్ కి అనిరుధ్ ఎలా ఫిట్ అవుతాడా అంటూ డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఫ్యాన్స్ లో.

NTR 30 : ఎన్టీఆర్ సినిమాలో మొగిలయ్య పాట??

మే 20 తారక్ బర్త్ డే సందర్భంగా కొరటాల సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలును ఫైనల్ చేశారు మేకర్స్. అనిరుధ్ లాగానే ఫస్ట్ టైమ్ జూనియర్ తో వర్క్ చేయబోతున్నాడు రత్నవేలు. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న ఈ మూవీని సైతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లోనే కొరటాల ప్లాన్ చేసారు. ఆచార్య ఎఫెక్ట్ ఈ మూవీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నెక్ట్ ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఉంది కాబట్టి ఈ కొరటాల సినిమా రేంజ్ చూపించాలి. ఇక తన 30వ సినిమాకి సంబంధించిన పూర్తి డిటేల్స్ మే 20నే రివీల్ కానున్నాయి.