చీకట్లను లెక్క చేయకుండా.. అల్లూ అర్జున్ కోసం.. రోడ్లపైకి వేలల్లో అభిమానులు

చీకట్లను లెక్క చేయకుండా.. అల్లూ అర్జున్ కోసం.. రోడ్లపైకి వేలల్లో అభిమానులు

మెగా కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న స్టైలీష్ స్టార్ అల్లూ అర్జున్.. మాస్ నుంచి క్లాస్ వరకు అన్నీ పాత్రల్లో తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ.. ఎంటర్‌టైన్ చేసి అభిమానులను దక్కించుకున్నాడు.

స్టైలిష్‌స్టార్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌.. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. విభిన్నమైన లుక్‌తో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, ఫస్ట్‌లుక్‌తో కొత్తగా కనిపిస్తున్నాడు.

పుష్ప సినిమాలో రగ్ లుక్‌లో బన్నీ కనిపిస్తూ ఉండగా.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో షూట్‌ జరుగుతోంది. భారీ సంఖ్యలో షూటింగ్ లొకేషన్‌కు అభిమానులు వస్తుండగా.. ‘పుష్ప’ షూట్‌కు వెళ్తున్న అల్లూ అర్జున్ కోసం రంపచోడవరం జంక్షన్ దగ్గర అభిమానులు భారీగా మోహరించారు.

తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమా షూట్‌లో అల్లూ అర్జున్ పాల్గొంటూ ఉండగా.. లొకేషన్‌కు వెళ్తున్న బన్నీ కారును ఆపి చిమ్మ చీకటిలో.. చీకట్లను లెక్క చేయకుండా.. అభిమానులు వచ్చి బన్నీ కోసం ఎదురుచూశారు. ఇటీవల కొంతమంది గిరిజనులు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలకగా.. రంపచోడవరంలో వేలాది మంది అభిమానులు రోడ్లపైకి వచ్చి బన్నీని చూశారు.

చిమ్మచీకట్లను సైతం లెక్కచేయకుండా అల్లూ అర్జున్‌ని చూడడం కోసం భారీగా అభిమానులు రాగా.. తనని చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి వారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.