Kangana ranaut : కంగనా రనౌత్ కు చంపేస్తామంటూ బెదిరింపులు

కొందరు ఆమెకు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారట. చంపేస్తామంటూ బెదిరింపుల‌కి దిగుతున్నారట‌. దీనిపై కంగ‌నా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. పంజాబ్‌లోని బటిందాకు......

Kangana ranaut : కంగనా రనౌత్ కు చంపేస్తామంటూ బెదిరింపులు

Kangana

Kangana ranaut :  బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్. దేశం గురించి, మహిళల గురించి, తన గురించి అయినా ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ అవుతుంది. ఎవరినైనా సరే ఎంతటి వారినైనా సరే తన మాటలతో చెడుగుడు ఆడేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఒకపక్క అదిరిపోయే సినిమాలు చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ దేశంలో జరిగే విషయాలపైన తన రీతిలో స్పందిస్తుంది. ఎన్నో సార్లు ఎంతోమందిపై భయపడకుండా కామెంట్స్ చేసింది. ఎప్పుడూ వివాదాల్లో ఉంటుంది కంగనా. అయినా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోతుంది.

Sirivennela : సిరివెన్నెలకి గూగుల్ నివాళి..

ఇటీవ‌ల సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటనను ఇచ్చింది. వీటి రద్దు కోసం పోరాడిన రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. అయితే కంగనా దీనిపై త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. దీన్ని ఓ ఖ‌లీస్థానీ ఉద్య‌మం అని, ఇలా సంబరాలు చేసుకునే వాళ్ళు ఉగ్ర‌వాదుల‌ని పేర్కొంది. ఈ వ్యాఖ్యలకు గాను సిక్కు మతస్థులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే కొందరు ఆమెకు డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారట. చంపేస్తామంటూ బెదిరింపుల‌కి దిగుతున్నారట‌.

Sirivennela : సిరివెన్నెలకి.. ఆ జిల్లాకి.. విడదీయలేని బంధం

దీనిపై కంగ‌నా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. పంజాబ్‌లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. దేశానికి ద్రోహం చేసే వారికి వ్యతిరేకంగా మాట్లాడతాను, అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లను వ్యతిరేకిస్తాను, తుక్డే తుక్డే గ్యాంగ్‌లను విమర్శిస్తాను, విదేశాల్లో కూర్చుని భారత్‌లో ఖలిస్తాన్‌ ఏర్పాటు కోసం కలలు కనే ఉగ్రవాదులనూ తప్పుబడతాను కాని ఇలాంటి బెదిరింపులకు మాత్రం నేను భయపడను. నన్ను చంపేస్తానని ఓ వ్యక్తి పంజాబ్‌లో బహిరంగంగా ప్రకటించాడు అని కంగనా పోస్ట్‌చేసింది.

Sirivennela : ఫిలిం ఛాంబర్‌లో సిరివెన్నెల భౌతిక కాయం.. సినీ ప్రముఖులు, అభిమానుల నివాళి

దీంతో పాటు సోనియా మీరు, మీ అత్త‌గారు కూడా మ‌హిళ‌లే కదా, ఓ మ‌హిళ‌పై బెదిరింపులు వ‌స్తున్న నేప‌థ్యంలో వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మీ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ కంగన పోస్ట్ చేసింది.