Virata Parvam: విరాటపర్వం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు! | Virata Parvam

Virata Parvam: విరాటపర్వం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు!

దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి....

Virata Parvam: విరాటపర్వం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు!

Virata Parvam: దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవిలు జంటగా నటిస్తుండగా, నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథగా ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.

Virata Parvam: విరాటపర్వం సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైం ఎంతంటే?

అయితే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈనెల 15న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ వేడుకకు ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు చీఫ్ గెస్టులు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Virata Parvam : మూడు రోజుల్లో విరాటపర్వం.. సాయిపల్లవి క్రేజ్‌తో పెరిగిపోతున్న అంచనాలు..

విరాటపర్వం చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్‌లతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇలా ఒక సినిమా కోసం ముగ్గురు క్రేజ్ ఉన్న స్టార్స్ వస్తుండటంతో ఈ ఈవెంట్ ఎంతటి గ్రాండ్ సక్సెస్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాలో బీజీఎం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

×