Major: మేజర్ కోసం బరిలోకి ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?
యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు....

Major: యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను ఎన్ఎస్‌జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తోంది మేజర్ చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరిని ఏ విధంగా చూపించబోతున్నారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు మేజర్ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.
Major: మేజర్ ట్రైలర్ వీక్షించిన డిఫెన్స్ మినిస్టర్
ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తాజాగా ఈ ట్రైలర్‌ను ఇండియాలోని ముగ్గురు బిగ్గెస్ట్ స్టార్స్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. ఇంతకీ ఆ ముగ్గురు స్టార్స్ ఎవరో తెలుసా.. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించింది చిత్ర యూనిట్. దీంతో ఆయా భాషల్లోని ముగ్గురు స్టార్ హీరోల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మేజర్ చిత్ర తెలుగు ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంఛ్ చేయనున్నాడు. అటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా మేజర్ హిందీ ట్రైలర్ లాంఛ్ కానుంది.
MAJOR : ‘మేజర్’.. విడుదల వాయిదా..
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేతుల మీదుగా ఈ చిత్ర మలయాళ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇలా ఒక ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించి మూడు భాషల్లో ట్రైలర్‌ను ముగ్గురు స్టార్స్‌తో రిలీజ్ చేయించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. మే 9న సాయంత్రం 4.59 గంటలు మేజర్ చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సాయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాల హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శశి కిరన్ తిక్కా ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, మే 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Three of India’s Biggest stars @urstrulyMahesh, @BeingSalmanKhan, @PrithviOfficial will be launching the #MajorTrailer Today at 4.59 PM 🔥#MajorTheFilm@AdiviSesh @saieemmanjrekar #SobhitaD @SashiTikka @SricharanPakala @sonypicsindia @GMBents @AplusSMovies @ZeeMusicCompany pic.twitter.com/NocQKaZlAc
— BA Raju’s Team (@baraju_SuperHit) May 9, 2022
1Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
2Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు
3Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
4Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
5Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
6Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
7Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
8OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
9Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
10Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
-
K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!