Telugu Movies Release: సుమతో యంగ్ హీరోల పోటీ.. నెగ్గేదెవరో?

కరోనాతో రెండేళ్ల పాటు నానా తిప్పలు పడిన సినిమాలన్నీ ఇప్పుడు వరసగా క్యూ కడుతున్నాయి. పుష్ప, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపుతో వరసపెట్టి భారీ సినిమాలన్నీ థియేటర్లలో దిగిపోతుండగా..

Telugu Movies Release: సుమతో యంగ్ హీరోల పోటీ.. నెగ్గేదెవరో?

Telugu Movies Release

Telugu Movies Release: కరోనాతో రెండేళ్ల పాటు నానా తిప్పలు పడిన సినిమాలన్నీ ఇప్పుడు వరసగా క్యూ కడుతున్నాయి. పుష్ప, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఊపుతో వరసపెట్టి భారీ సినిమాలన్నీ థియేటర్లలో దిగిపోతుండగా వీలు చూసుకొని పెద్ద సినిమాల హవా లేని సమయంలో చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ పనిపట్టి కలెక్షన్లను కొల్లగొట్టగా.. రెండేళ్లుగా ఎప్పుడొద్దామా అని ఎదురుచూసిన ఆచార్య కూడా ఈ వారం వచ్చేశాడు.

Telugu Movies: భారీ సినిమాల మధ్యలో ముద్దుగా వస్తున్న రొమాంటిక్ మూవీస్!

దీంతో వచ్చే వారం చిన్న సినిమాలు ఫోకస్ పెట్టాయి. రాకరాక పెద్ద సినిమాల మధ్య వచ్చిన గ్యాప్ కావడంతో ఒకేసారి ముగ్గురు రిలీజ్ పెట్టేసుకున్నారు. తెలుగులో స్టార్ యాంకర్​ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. చాలాకాలం తర్వాత సుమ మళ్ళీ వెండితెర మీదకి రాబోతుంది. ఆమె నటించిన ‘జయమ్మ పంచాయతీ’ సినిమా మే 6న రిలీజ్ కాబోతుంది. గ్రామీణ నేపథ్యంతో సాగే కథ కావడం.. లేడీ ఫాలోయింగ్ లో సుమకు ప్లస్ పాయింట్ ఉండడంతో మంచి అంచనాలే ఉన్నాయి.

Telugu Movies: అన్ని ఎలిమెంట్స్ కాదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు!

ఇక, అదే రోజు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా థియేటర్ల మీద దాడికి సిద్ధమయ్యారు. మాస్​ కా దాస్ విశ్వక్ సేన్​ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. రుక్సార్ దిల్లాన్​ హీరోయిన్​గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్​ చింతా దర్శకత్వం వహించారు. మూడు పదుల వయసులో వివాహం అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. కామెడీ ఎంటర్ టైనర్ కావడం.. థర్టీ ప్లస్ ఏజ్ లో పెళ్లి కాని యువకుడి కష్టాల కాన్సెప్ట్ కావడంతో యూత్ కనెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఎక్కువ.

Telugu Movies: మారిన ఆడియన్స్ టేస్ట్.. ఏ పెద్ద సినిమా అయినా వారం రోజులే!

ఇక ఫైనల్ గా శ్రీవిష్ణు హీరోగా, కేథరీన్ త్రేసా హీరోయిన్​గా వస్తున్న ‘భళా తందనాన’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. వారాహి బ్యానర్​పై చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేజీఎఫ్​ ఫేమ్ గరుడ రామ్​ విలన్​గా నటించడం.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం వంటి ప్లస్ పాయింట్స్ తోడవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి మే మొదటి వారంలో ఈ మూడు సినిమాలలో ఎవరు నెగ్గుతారు? ఏ సినిమాకి ప్రేక్షకుల ఆమోదం లభిస్తుందో చూడాలి.