మా అమ్మని తిట్టి, తమ్ముణ్ణి కొట్టాడు.. సినిమా స్టార్ట్ అయ్యాక నాకు సినిమా చూపించాడు.. విశాల్.. చూస్తుండు.. ప్రశాంతగా నిద్రపోలేవ్ నువ్వు..

‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్) సీక్వెల్ విషయంలో విశాల్‌తో నెలకొన్న వివాదం గురించి వివరించిన దర్శకుడు మిస్కిన్..

  • Published By: sekhar ,Published On : March 15, 2020 / 12:01 PM IST
మా అమ్మని తిట్టి, తమ్ముణ్ణి కొట్టాడు.. సినిమా స్టార్ట్ అయ్యాక నాకు సినిమా చూపించాడు.. విశాల్.. చూస్తుండు.. ప్రశాంతగా నిద్రపోలేవ్ నువ్వు..

‘తుప్పరివాలన్ 2’ (డిటెక్టివ్) సీక్వెల్ విషయంలో విశాల్‌తో నెలకొన్న వివాదం గురించి వివరించిన దర్శకుడు మిస్కిన్..

తమిళ నటుడు విశాల్ కొత్త సినిమా ‘తుప్పరివాలన్-2’ (‘డిటెక్టివ్’కు సీక్వెల్).. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వ బాధ్యతల   నుంచి తప్పుకున్నాడు. కొద్దిరోజులుగా విశాలే డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, మిస్కిన్‌తో నెలకొన్న వివాదం గురించి క్లారిటీ ఇచ్చాడు విశాల్.

తాజాగా డైరెక్టర్ మిస్కిన్ తన వెర్షన్ వినిపించాడు. తన తల్లిని తిట్టడమే కాక, తమ్ముడిపై చేయి చేసుకున్నాడని, విశాల్‌కు ఇక కష్టాలు మొదలయ్యాయని విమర్శించాడు మిస్కిన్.. 
‘‘విశాల్ హీరోగా నేను చేసిన ‘తుప్పరివాలన్’ (డిటెక్టివ్) సినిమాకు గాను నాకు రూ.3 కోట్ల జీతమిచ్చారు. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న విశాల్‌కు హిట్ ఇచ్చాను. కొంత కాలం తర్వాత విశాల్ నన్ను కలిశాడు. అప్పటికే అతను చాలా అప్పుల్లో ఉన్నాడు. మంచి కథతో సినిమా చేయాలనే ప్లాన్‌లో ఉన్నానని చెప్పగా.. కోహినూర్ డైమండ్ రాబరీ నేపథ్యంలో అనుకున్న ‘తుప్పరివాలన్ 2’ కథ చెప్పాను.

బాగా నచ్చి నేనే నిర్మిస్తానని చెప్పాడు. భారీ బడ్జెట్ అవుతుంది వేరే నిర్మాతను చూద్దామని చెప్పినా వినకుండా నేనే నిర్మిస్తానని చెప్పాడు. సినిమా స్టార్ట్ అయింది. బడ్జెట్ విషయంలో వాదోపవాదాలు జరిగాయి. ఆ సమయంలో నేను తమ్ముడిలా భావించిన విశాల్.. నా తల్లిని అసభ్యపదజాలంతో దూషించాడు. నా తమ్ముణ్ణి కొట్టాడు. విశాల్.. నీకు కష్టాలు మొదలయ్యాయి.. ఇక నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పోలేవు’’ అని మిస్కిన్ హెచ్చరిక చేశారు.  

Thupparivaalan 2