టిక్‌టాక్ స్టార్స్.. పాపులర్ యాంకర్స్ ప్రత్యేక ఆకర్షణగా ‘బిగ్‌బాస్ 4’

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 01:08 PM IST
టిక్‌టాక్ స్టార్స్.. పాపులర్ యాంకర్స్ ప్రత్యేక ఆకర్షణగా ‘బిగ్‌బాస్ 4’

Tictac Stars in Bigboss 4: కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 4 వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానుంది. వాస్తవానికి బిగ్‌బాస్‌ సీజన్‌ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.



ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలను ఎంత కాలం క్వారంటైన్‌లో ఉంచాలి? ఒక సారి షోలో ప్రవేశించిన తర్వాత వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే ఏం చేయాలి? వీకెండ్‌లో ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా?.. వంటి అనేక అంశాలపై సందిగ్ధత నెలకొనటంతో ఈ షో ఆలస్యమైంది. షోలో పాల్గొనే కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే క్వారంటైన్‌లో ఉంచారు.

బుల్లితెరపై పేరుమోసిన యాంకర్లు, ఇతర నటీనటులతో పాటుగా టిక్‌టాక్‌ స్టార్లను కూడా ఈ సారి షోకు ఎంపిక చేశారు. వీరు ఈ సారి షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన బిగ్‌‌బాస్ ప్రోమోలకు మంచి స్పందన లభించింది. ఈ సారి నాగ్ డిఫరెంట్ గెటప్స్‌లో ఆకట్టుకోనున్నారు.