Acharya : ‘ఆచార్య’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఇప్పటికే ఆచార్య సినిమాకి తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. తాజాగా జగన్ ప్రభుత్వం కూడా ఆచార్య టీంకి గుడ్ న్యూస్...

Acharya : ‘ఆచార్య’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Acharya

Acharya :  చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రిలీజ్ కి మూడు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఆచార్య సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దాదాపు 130 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడం లేదు. కేవలం తెలుగు లాంగ్వేజ్ తోనే అన్ని చోట్ల రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆచార్య సినిమాకి తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. తెలంగాణాలో మల్టిప్లెక్స్ లో 50 రూపాయలు, ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. అంతే కాక అయిదవ ఆటకి కూడా తెలంగాణలో పర్మిషన్ వచ్చింది. దీనిపై ఆచార్య టీం సంతోషం వ్యక్తం చేసింది. తాజాగా జగన్ ప్రభుత్వం కూడా ఆచార్య టీంకి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కూడా ఆచార్య సినిమాకి టికెట్ రేటు పెంచుకునేలా పర్మిషన్ వచ్చింది.

 

Prashanth Neel : కేజిఎఫ్ సినిమాలో అందరికి గడ్డాలు ఎందుకు ఉన్నాయో తెలుసా ??

ఏపీలో టికెట్ రేటు పెంచాలంటే సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటాలి అంతే కాక ఏపీలో ఆ సినిమా 20 శాతం అయినా షూటింగ్ చేసి ఉండాలి. అయితే ఆచార్య సినిమా ఆ జీవో రాకముందే చిత్రీకరణ మొదలైంది కాబట్టి, 100 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన సినిమా కావడంతో ఆచార్య సినిమాకి టికెట్ రేటు పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. 50 రూపాయల వరకు టికెట్ రేటు పెంచుకునేలా వెసలుబాటు కల్పించింది. సినిమా రిలీజ్ ఏప్రిల్ 29 నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరని పెంచుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.