TIPS Music : హిస్టారికల్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టిప్స్..

పాపులర్ టిప్స్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ సంస్థ పవన్ కళ్యాణ్-సమంతల సినిమాలతో తెలుగు మార్కెట్‌లోకి ఎంటర్ అవబోతోంది..

TIPS Music : హిస్టారికల్ ఫిల్మ్స్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టిప్స్..

Tips Music

TIPS Music: మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో (డైరెక్ట్ లేదా డబ్) రిలీజ్ అవుతూ మిగతా ఇండస్ట్రీలను, ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి’ నుండి నార్త్‌లో సత్తా చాటుతున్నాయి తెలుగు సినిమాలు.

Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం

ఇటీవల రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమానే ఉదాహరణగా చెబుతూ.. హిందీ సినిమాలు తెలుగు సినిమాల వసూళ్లను కూడా అందుకోలేకపోతున్నాయని కామెంట్ చేశారు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఇక హిందీ డబ్బింగ్ రూపంలోనూ తెలుగు సినిమాలకు ఏ రేంజ్ ఆదరణ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.

Selfiee Movie : ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌లో!

మన కథలతో పాటు ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి ఎంటర్ అవడానికి బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాపులర్ ఆడియో సంస్థ టిప్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రిష్‌ల ‘హరిహరి వీరమల్లు’ తో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమాల ఆడియో రైట్స్ టిప్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ రెండూ కూడా హిస్టారికల్ ఫిల్మ్స్ కావడం విశేషం.

Tips Music Kumar