Titanic Re-Release: పాతికేళ్ల టైమ్‌లెస్ లవ్‌స్టోరీ.. ప్రేమికుల రోజు కానుకగా మళ్లీ వస్తోంది!

హీలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఎపిక్ లవ్‌స్టోరీ మూవీ ‘టైటానిక్’ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1997లో రిలీజ్ అయిన ఈ క్లాసిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఎప్పటికీ కొన్ని రికార్డులను తనపేరున రాసుకున్న టైటానిక్ ఇప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ అయితే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ మూవీ.

Titanic Re-Release: పాతికేళ్ల టైమ్‌లెస్ లవ్‌స్టోరీ.. ప్రేమికుల రోజు కానుకగా మళ్లీ వస్తోంది!

Titanic Re-Release On Valentines Weekend

Titanic Re-Release: హీలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఎపిక్ లవ్‌స్టోరీ మూవీ ‘టైటానిక్’ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1997లో రిలీజ్ అయిన ఈ క్లాసిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ, ఎప్పటికీ కొన్ని రికార్డులను తనపేరున రాసుకున్న టైటానిక్ ఇప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ అయితే జనాలు టీవీలకు అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీఫుల్ రొమాంటిక్ మూవీ.

సముద్రంలోకి వెళ్లి ‘టైటానిక్’ చూడొచ్చు.. ఖర్చు రూ .93 లక్షలు.. చరిత్రలో నిలిచే అవకాశం!

ఇక ఈ సినిమాలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్‌ల జోడీ అప్పట్లో ఓ సెన్సేషన్. వారిద్దరు కలిసి నటించిన తీరు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను.. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రభంజానికి వరల్డ్‌వైడ్ బాక్సాఫీసులు దాసోహం అన్నాయి. వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా, ఈ సినిమా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను అందుకుని సినీ చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీని రీమాస్టర్ చేసి 4K వెర్షన్‌లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను వాలెంటైన్స్ డే వీకెండ్ కానుకగా ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. టైమ్‌లెస్ లవ్‌స్టోరీని మరోసారి బిగ్ స్క్రీన్‌పై వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.