Warrior : మళ్ళీ టైటిల్ వివాదం.. రామ్, హవీష్ ఎవరు ‘వారియర్’??

తాజాగా ఉస్తాద్ రామ్ నిన్న లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ 'ది వారియర్' అని ప్రకటించాడు. హీరో హవీష్ కూడా 'వారియర్' అనే టైటిల్ తో నిన్నే సినిమాని ప్రకటించాడు....

Warrior : మళ్ళీ టైటిల్ వివాదం.. రామ్, హవీష్ ఎవరు ‘వారియర్’??

Warrior

Warrior :   ఇటీవల సినీ పరిశ్రమలో టైటిల్ వివాదాలు తరచుగా తలెత్తుతున్నాయి. ఒకరి టైటిల్ ఒకరు వాడుకుంటున్నారని కంప్లైంట్స్ కూడా తలెత్తుతున్నాయి. చాలా సినిమాలకి ఇలాంటి టైటిల్స్ వివాదం తలెత్తింది. స్టార్ హీరోలు సైతం ఈ వివాదాన్ని ఎదుర్కున్న వారే. ఆ తర్వాత టైటిల్ మార్చుకోవడమో లేక టైటిల్ ముందు హీరో పేరు లేదా వేరే ఇంకేదైనా టైటిల్ ని యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా ఉస్తాద్ రామ్ నిన్న లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘ది వారియర్’ అని ప్రకటించాడు. హీరో హవీష్ కూడా ‘వారియర్’ అనే టైటిల్ తో నిన్నే సినిమాని ప్రకటించాడు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య టైటిల్ వివాదం నడుస్తుంది. అయితే ఇది అన్యాయం అని, వారియర్ టైటిల్ తనది అని, ఆల్రెడీ స్క్రిప్ట్ పూర్తయిందని, సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉందని, టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించామని.. ఇలాంటి సమయంలో వారు టైటిల్‌ను ఇలా ప్రకటించడం సరైంది కాదని, ఈ విషయం మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్, చాంబర్ వద్దకు వెళ్తాను అని హవీష్ అంటున్నాడు.

Anushka : ‘అరుంధతి’ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

అయితే ఇప్పటికే రామ్ స్టార్ హీరో, హవీష్ ఒకటి రెండు సినిమాలతో పలకరించినా ఎవరికీ అంత తెలీదు. కాబట్టి టైటిల్ మారిస్తే హవీష్ మార్చుకునే పరిస్థితి ఎదురవురుతుంది. లేదా హవీష్ కేవలం ‘వారియర్’ అని టైటిల్ పెట్టాడు. రామ్ మాత్రం ‘ది వారియర్’ అని పెట్టాడు. ఈ చిన్న డిఫరెన్స్ తో సినిమాని రిలీజ్ చేయొచ్చు అని రామ్ చిత్ర బృందం భావిస్తున్నారట. ఈ చిన్న డిఫరెన్స్ ఉన్నా వద్దు కంప్లైంట్ చేస్తాను అని హవీష్ అంటున్నట్టు సమాచారం. మరి ఈ టైటిల్ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.