అశ్వథ్థామ : టైటిల్ లుక్

దీపావళి నాడు యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న‘అశ్వథ్థామ’.. టైటిల్ పోస్టర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 27, 2019 / 05:42 AM IST
అశ్వథ్థామ : టైటిల్ లుక్

దీపావళి నాడు యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటిస్తున్న‘అశ్వథ్థామ’.. టైటిల్ పోస్టర్ రిలీజ్..

యంగ్ హీరో నాగశౌర్య, మెహరీన్ జంటగా, రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై, ఉషా ముల్పూరి నిర్మిస్తున్న సినిమా.. ‘అశ్వథ్థామ’.. దీపావళి నాడు ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

టైటిల్ లోగో అండ్ డిజైనింగ్ ఆకట్టుకునేలా ఉంది. 2020 ఫిబ్రవరిలో ‘అశ్వథ్థామ’ విడుదల కానుంది. ఫైట్ మాస్టర్ అన్బరివ్ ఆధర్వంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఫైట్‌లో డూప్ లేకుండా నటించడం వల్ల నాగశౌర్య ఎడమకాలికి తీవ్ర గాయమైంది.

Read Also : నిశ్శబ్ధం : ప్రీ-టీజర్.. అనుష్క బర్త్‌డేకి టీజర్

కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి షూట్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ‘అశ్వథ్థామ’ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ రూ.3.15 కోట్లకు ‘అశ్వథ్థామ’ శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది..