సిద్ధార్థ్ ‘టక్కర్’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన వరుణ్ తేజ్

సిద్ధార్థ్ నటించిన ‘టక్కర్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..

  • Published By: sekhar ,Published On : December 10, 2019 / 06:47 AM IST
సిద్ధార్థ్ ‘టక్కర్’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన వరుణ్ తేజ్

సిద్ధార్థ్ నటించిన ‘టక్కర్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..

సిద్ధార్థ్.. ఒకప్పుడు తెలుగు యంగ్ హీరోల్లో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతకొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్‌కి థ్రిల్లర్ మూవీ ‘గృహం’ రిలీఫ్‌నిచ్చింది. ఇటీవల విడుదలైన ‘వదలడు’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ‘టక్కర్’ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు.

Image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సిద్ధార్థ్ నటించిన ‘టక్కర్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘కప్పల్’, ‘పండవుల్లో ఒకడు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వైర్క్ జరుపుకుంటుంది. 2020 ఫిబ్రవరిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.