Telugu Movies: ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్!

నిన్నమొన్నటి వరకు ఇండియన్ సినిమాలో మేజర్ క్రేజ్ బాలీవుడ్ దే. ఇండియన్ సినిమా హిస్టరీ లో మేజర్ షేర్ బాలీవుడ్ దే.

Telugu Movies: ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్!

Pan India Films

Telugu Movies: నిన్నమొన్నటి వరకు ఇండియన్ సినిమాలో మేజర్ క్రేజ్ బాలీవుడ్ దే. ఇండియన్ సినిమా హిస్టరీ లో మేజర్ షేర్ బాలీవుడ్ దే. కానీ లెక్క మారిందిప్పుడు. పాన్ ఇండియా వైడ్ తెలుగు సినిమా సత్తా చూసి షాక్ అవుతున్నాయి అన్ని ఇండస్ట్రీలు. స్టార్ వాల్యూ పెరగడమే కాదు చాలా విషయాల్లో నంబర్ వన్ అనిపించుకుంటోంది టాలీవుడ్. టాలీవుడ్ స్టామినా అంచనాలకు అందట్లేదు. మేకర్స్ మార్కెటింగ్ టెక్నిక్స్, ఎంచుకుంటోన్న సబ్జెక్ట్స్, ప్రొజెక్ట్ చేస్తోన్న స్టైల్ అన్నీ… అన్నీ టాలీవుడ్ ని నంబర్ 1 చేసేశాయి. బాహుబలితో తెలుగు సత్తా చాటిన రాజమౌళి… మిగిలిన వారికి రోల్ మోడల్ అయ్యారు. రికార్డ్ కలెక్షన్స్ తో అందరినీ అలర్ట్ చేసారు. సో డబ్బింగ్ సినిమాలతో ఆల్రెడీ పరిచయమున్న టాలీవుడ్ హీరోలు…కనెక్ట్ చేసే కంటెంట్ తో వస్తే ఆదరిస్తున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు.

NTR 30: కొరటాల కోసం యాంగ్రీమెన్.. ఎన్టీఆర్ బాబాయ్ ఫిక్స్?

2021లో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప. అక్కడితో టాలీవుడ్ రేంజ్ ఆగిపోలేదు. గతేడాది అత్యథిక గ్రాస్ సాధించిన ఇండస్ట్రీగానూ పేరుతెచ్చుకుంది. మొత్తం 1300 కోట్ల కలెక్షన్స్ తో కొవిడ్ టైం లోనూ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పుష్పతో సహా అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు, క్రాక్, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాల కలెక్షన్ కలుపుకుంటే 1300కోట్లను క్రాస్ చేసింది. దీంతో ఒక్కొక్కరుగా తెలుగు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. కొవిడ్ దెబ్బే కాదు… హిందీ పరిశ్రమకు తెలుగు దెబ్బ కాస్త గట్టిగానే తగిలిందంటున్నారు.

DJ Tillu: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

ఇప్పుడు తెలుగు సినిమాపై ఫుల్ ఫోకస్ చేసింది బాలీవుడ్. ఇక్కడి హీరోల కోసం అక్కడి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి దర్శకులపై అక్కడి హీరోలు మనసు పారేసుకుంటున్నారు. ప్రొడ్యూసర్స్ తెలుగు స్టార్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు… కోలీవుడ్, శాండిల్ వుడ్, మలయాళీ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్ కి వలస వచ్చేస్తున్నారు స్టార్స్. ఓసారి సెట్స్ పై ఉన్న సినిమాలని అబ్జర్వ్ చేస్తే ఈ విషయం స్పష్టంగానే అర్ధమవుతుంది. ఇక జక్కన్న ట్రిపుల్ ఆర్ బయటికొస్తే ఈ లెక్క ఇంకాస్త పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

Hero Trailer: ‘హీరో’ తొలి సినిమా కష్టాలకు తోడైన ప్రేమ!

కంప్లీట్ గా మెట్రో సెంట్రిక్ సినిమాలు చెయ్యడంలో బిజీగా ఉన్న బాలీవుడ్ .. రూరల్, అర్బన్ ని పెద్దగా కన్ సిడర్ చెయ్యడం లేదు. దాంతో హిందీలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలు బాలీవుడ్ ని దెబ్బతీయబోతున్నాయనే చర్చ బాలీవుడ్ లో నడుస్తోంది. అందుకే అలాంటి కంటెంట్ తో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు మిగిలిన హీరోలు. పుష్పతో అక్కడ అల్టిమేట్ క్రేజ్ కొట్టేసిన బన్నీ.. ప్రమోషన్స్ తోనే మార్కులు కొట్టేసిన తారక్, చరణ్ లతో సహా మహేశ్ వంటి పెద్ద హీరోలతో పాటూ చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాకే ఓటేస్తున్నారు. తమ తర్వాతి సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే చూపించాలని డిసైడయ్యారు.