ప్రధాని పిలుపుకు సెలబ్రిటీల సంఘీభావం.. ఏమన్నారంటే..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు సంఘీభావం తెలిపిన తెలుగు హీరోలు..

  • Published By: sekhar ,Published On : April 4, 2020 / 02:05 PM IST
ప్రధాని పిలుపుకు సెలబ్రిటీల సంఘీభావం.. ఏమన్నారంటే..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు సంఘీభావం తెలిపిన తెలుగు హీరోలు..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం(ఏప్రిల్ 5) రాత్రి అందరూ 9 గంటలకు 9 నిమిషాల పాటు ఎవరికి తోచిన విధంగా వారు వెలుగును ప్రసరింపజేయండి అని ఇచ్చిన పిలుపుకు అందరూ సంఘీభావం తెలపాలని టాలీవుడ్ స్టార్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. 
‘‘మన గౌరవ భారత ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు రేపు(ఆదివారం) రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు మనందరం మన కుటుంబ సభ్యులతో కలిసి, మన ఇంటి బయటికి వచ్చి.. కొవ్వొత్తులుగానీ, సెల్‌ఫోన్ ప్లాష్‌లుగానీ, అలాగే టార్చిలైట్‌లను వెలిగించి సంఘీభావాన్ని తెలుపుదాం. కరోనాని తుదముట్టించడానికి భారతీయులందరూ ఒక్కటయ్యారనే సందేశాన్ని ప్రపంచదేశాలకు చాటి చెబుదాం. రండి.. భారత ప్రధాని పిలుపుకు స్పందించండి. కరోనాని అంతమొందించండి. అందరూ ఒక్కటై వెలుగును నింపండి. జైహింద్..’’ అని చెబుతూ.. ఓ వీడియోని చిరంజీవి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Read Also : కలియుగ ‘బ్రహ్మ’ వర్మ- కరోనా గురించి రెండేళ్ల క్రితమే చెప్పాడు..

‘‘జనతా కర్ఫ్యూ రోజున మనమందరం చూపించిన సంఘీభావం మళ్లీ ఇంకొకసారి చుపెడదాం.. దేశమంతా ఒకటే అని ఐకమత్యంతో కరోనాపై మనం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని తెలియ చేద్దాం’’.. అంటూ అక్కినేని నాగార్జున తెలిపారు.
‘‘లాక్ డౌన్ నిర్ణయాన్ని గౌరవించి పాటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను. వారందరిపైనా నా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడదే స్ఫూర్తితో  రేపు రాత్రి 9 గంటలకి తొమ్మిది నిమిషాల పాటు  మన ఇళ్లలో ఉన్న లైట్లన్నీ ఆపేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి గారి మాట పాటిద్దాం. కరోనా లేని భారత్‌ను సాధిద్దాం’’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు.