టాలీవుడ్ సెలబ్రిటీల భోగి సంబరాలు చూశారా!

తెలుగు వారి పెద్ద పండగలో మొదటిరోజైన భోగి సంబరాలను టాలీవుడ్ ప్రముఖులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు..

  • Edited By: sekhar , January 14, 2020 / 10:58 AM IST
టాలీవుడ్ సెలబ్రిటీల భోగి సంబరాలు చూశారా!

తెలుగు వారి పెద్ద పండగలో మొదటిరోజైన భోగి సంబరాలను టాలీవుడ్ ప్రముఖులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు..

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు లోగిళ్లు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజులపాటు కోలాహలంగా జరుపుకునే తెలుగు వారి పెద్ద పండగలో మొదటిరోజైన భోగి సంబరాలను టాలీవుడ్ ప్రముఖులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వాకిట్లో రంగవల్లులతో, భోగి మంటలతో సందడి చేశారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబమంతా ఓ చోటచేరి భోగిని ఘనంగా నిర్వహించారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, నిహారిక, సుష్మితలతో సహా ఇతర కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిహారిక దోశ వేస్తున్న ఫొటోను సుష్మిత.. దోశ స్టెప్పు అని పేర్కోవడం విశేషం. కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో భోగి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లు పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Image

‘కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు. అలాగే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌ కూడా ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు చెప్పారు. హీరోయిన్‌ ఈషా రెబ్బా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  

Image