సీఎం కేసీఆర్‌కు టాలీవుడ్ కృతజ్ఞతలు

  • Published By: sekhar ,Published On : November 24, 2020 / 03:28 PM IST
సీఎం కేసీఆర్‌కు టాలీవుడ్ కృతజ్ఞతలు

Tollywood Industry: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో టాలీవుడ్‌కు కూడా స్థానం కల్పించారు.

సినిమా పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతూ.. రూ.10 కోట్లలోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు జీఎస్టీ రియంబర్స్‌మెంట్‌ కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.


థియేటర్లకు కనీస విద్యుత్‌ ఛార్జీలను రద్దు, సినిమా టికెట్‌ ధరలో సవరణలు చేసేందుకు అనుమతి ఇవ్వడం థియేటర్‌ యాజమాన్యం రోజూవారీ ప్రదర్శనల సంఖ్య పెంచుకోవడం వంటి అంశాలను తెరాస మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.

పరిశ్రమలో ఉన్న దాదాపు 40వేల కార్మికులకు రేషన్‌ కార్డ్‌, హెల్త్‌ కార్డుల సదుపాయం కల్పించి వారిని కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేసీఆర్‌ కల్పించిన రాయితీలకుగానూ యావత్ టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.



https://10tv.in/telangana-high-court-issues-show-cause-notices-to-ram-gopal-varma-on-disha-movie/
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, రవితేజ, రామ్, నితిన్, మంచు మనోజ్, రాజమౌళి, ఛార్మీ, పూరి జగన్నాథ్, సంపత్ నంది, హరీష్ పెద్ది, 14 రీల్స్ ప్లస్,

మెహర్ రమేష్, నందిని రెడ్డి, ఎమ్మెస్ రాజు, వైజయంతి మూవీస్, హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని, సుధీర్ బాబు, అనిల్ రావిపూడి సహా పలువురు నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ కృతజ్ఞతలు తెలిపారు.