Tollywood Cricket : మరోసారి టాలీవుడ్ క్రికెట్.. ఈ సారి అమెరికాలో..

ప్రస్తుతం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కి కెప్టెన్ గా నటుడు శ్రీకాంత్ ఉన్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ''క్రికెట్‌ అంటే మా అందరికీ చాలా.....

Tollywood Cricket : మరోసారి టాలీవుడ్ క్రికెట్.. ఈ సారి అమెరికాలో..

Tollywood Cricket

 

Tollywood Cricket :  మన దేశంలో సినిమాకి, క్రికెట్ కి వీరాభిమానులు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ రెండు కలుస్తుంటాయి కూడా. గతంలో అనేక సార్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరిగాయి. గతంలో మన స్టార్లు వేరే సినీ పరిశ్రమలతో కలిసి ఆడారు, మన వాళ్ళే కొన్ని టీమ్స్ గా విడిపోయి ఆడారు. ఇక చారిటి కోసం అంటే మన స్టార్లు ముందుంటారు. చారిటి మ్యాచ్ లు ఎప్పుడు ఆడటానికి అయినా రెడీగా ఉంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీ లీగ్స్ అంతగా జరగట్లేదు. ఇటీవలే కొంతమంది టీవీ ఆర్టిస్టులు కలిసి క్రికెట్ ఆడారు. తాజాగా మరోసారి టాలీవుడ్ ప్రముఖులంతా బ్యాట్, బాల్ పట్టనున్నారు.

 

ప్రస్తుతం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ కి కెప్టెన్ గా నటుడు శ్రీకాంత్ ఉన్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ”క్రికెట్‌ అంటే మా అందరికీ చాలా ఇష్టం. మంచి పనుల కోసం మేం చాలా సార్లు క్రికెట్‌ ఆడాం. మరోసారి మరో మంచిపని కోసం క్రికెట్ ఆడబోతున్నాం. ఈ సారి అమెరికాలోని డల్లాస్‌లో క్రికెట్‌ ఆడనున్నాం. ఇందుకు చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో శ్రీకాంత్, తరుణ్, తమన్, ప్రిన్స్, సుధీర్ బాబు, భూపాల్.. తదితర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

 

Roja : మంత్రి పదవి రావడంతో రోజా కీలక నిర్ణయం.. సినిమాలకి, జబర్దస్త్‌కి రోజా గుడ్‌బై..

ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎలైట్‌ మీడియా ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో టాలీవుడ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి, యూనివర్సల్‌ ఎక్స్‌ ఎల్‌ జట్టుకి మధ్య సెప్టెంబర్‌లో ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. అయితే ఈ యూనివర్సల్‌ ఎక్స్‌ ఎల్‌ జట్టుని ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. సినీ తారలతో క్రికెట్‌ ఆడాలనుకునే ఎవరైనా ఈ బిడ్డింగ్‌లో పాల్గొని వారితో ఈ క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చు. దీనికి సంబంధించిన వివరాలన్నీ ఈస్ట్‌వెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు.