Tollywood Directors: డైరెక్టర్‌లు రెడీ.. స్టార్ హీరోల సినిమాలు స్టార్టయ్యేదెప్పుడు?

సెకండ్ వేవ్ తర్వాత బ్యాలెన్స్ ఉన్న షూటింగ్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్లు. అంతేకాదు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా..

Tollywood Directors: డైరెక్టర్‌లు రెడీ.. స్టార్ హీరోల సినిమాలు స్టార్టయ్యేదెప్పుడు?

Tollywood Directors

Tollywood Directors: సెకండ్ వేవ్ తర్వాత బ్యాలెన్స్ ఉన్న షూటింగ్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్లు. అంతేకాదు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది డైరెక్టర్లయితే సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ మన స్టార్ డైరెక్టర్లు నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసేదెప్పుడు.. వాళ్ళ చేతుల్లో ఉన్న సినిమాలేంటో చూద్దాం.

Sandeepa Dhar: సొగసుల సంపద సందీప సొంతం!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కోవిడ్ తో లేట్ అయిపోయిన తమ సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూనే.. కొత్త సినిమాలకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ఎంగేజ్ అయిపోయారు. ఎప్పటినుంచో కలలు కంటున్న తమ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ట్రాక్ ఎక్కించడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్లు. అటు హీరోలు కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ ఇచ్చి రెడీగా ఉన్నారు. ఇంతకీ మరి ఈ క్రేజీకాంబినేషన్స్ తెరకెక్కేదెప్పుడో చూడాల్సి ఉంది.

Shyam Singha Roy: రెబల్‌గా మారిన నానీ.. బెంగాలీ బ్యాక్‌డ్రాప్ వర్కవుట్ అయ్యేనా?

అల వైకుంఠపురంలో సినిమా తర్వాత.. ఇప్పటి వరకూ మరో సినిమా డైరెక్ట్ చెయ్యని త్రివిక్రమ్ కొత్త సినిమా ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతానికి మహేష్ సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉండడంతో భీమ్లానాయక్ కి రైటర్ గా బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు బీమ్లానాయక్ కూడా లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో మహేష్ సినిమా ముహూర్తం గురించి ఆలోచిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతికి స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు టీమ్.

Telugu Actors: క్విక్ షూట్.. హై రెమ్యునరేషన్.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!

మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా నెక్ట్స్ సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోవడంతో ఎన్టీఆర్ ఫ్రీ అయిపోయారు. అటు కొరటాల కూడా ఆచార్య సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నారు. అంతేకాదు మరోవైపు ఎన్టీఆర్ తో సినిమాకి ప్రీప్రొడక్షన్ కూడా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత తెరకెక్కబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లేది ఇయర్ ఎండ్ కే అంటున్నారు అందరూ.

Pushpa: బన్నీ మేనియా.. కేరళలో స్పెషల్ షోస్ బుకింగ్ స్టార్ట్!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.. ట్రిపుల్ఆర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ అయిపోక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశారు. కౌబాయ్ యాక్షన్ డ్రామాగా క్రేజీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా గురించి చాలా కాలం నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. జనవరి తర్వాత ఫ్రీ అయిపోతున్న రాజమౌళి.. మహేష్ తో సినిమాని సమ్మర్ కి స్టార్ట్ చేస్తాడని న్యూస్ వినిపిస్తోంది.

Anchor Manjusha : హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్..

ప్రజెంట్ పుష్ప షూటింగ్ తో బిజీ గా ఉన్న సుకుమార్ కూడా నెక్ట్స్ సినిమా ఎప్పుడు మొదలుపెడదామా అనుకుంటూ ప్లాన్లు వేసుకుంటున్నారు. బన్నీతో చేస్తున్న పుష్ప 2 పార్ట్స్ అవ్వకముందే విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశారు సుకుమార్. అయితే ఒక సినిమా అనుకున్న పుష్ప 2 పార్ట్స్ అవ్వడంతో ఈ సినిమా మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు సుకుమార్. మరి విజయ్ తో సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

టాలీవుడ్ లో ప్రజెంట్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కూడా ప్రజెంట్ విజయ్ దేవరకొండతో చేస్తున్న లైగర్ సినిమా తర్వాత నెక్టస్ ఎవరితో సినిమా చేస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే పూరీజగన్నాధ్ తో పైసా వసూల్ లాంటి క్రేజీ మూవీ చేసిన బాలయ్య మరోసారి ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు పూరీ రౌడీ హీరోతోనే మరోసారి కాంబో ఫిక్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సుకుమార్ తో కమిట్ మెంట్ ఉన్న విజయ్ .. వెంటనే పూరీతో సినిమా చేస్తాడా అన్నది మాత్రం డౌటే.