Tollywood Drugs : ఈడీ ఎదుట నటుడు నందు, ముందుగానే హాజరు!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈడీ అధికారుల ఎదుట 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం...నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు హాజరయ్యారు.

Tollywood Drugs : ఈడీ ఎదుట నటుడు నందు, ముందుగానే హాజరు!

Drug Case

Actor Nandu : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్  (ED) విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈడీ అధికారుల ఎదుట 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం…నటుడు, సింగర్ గీతా మాధురి భర్త నందు హాజరయ్యారు. వాస్తవానికి ఈయన 20వ తేదీన హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ..ఆయన వ్యక్తిగత కారణాలతో ముందుగానే విచారణకు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన్న అధికారులు విచారిస్తున్నారు. విచారణలో ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారనేది తెలియరావడం లేదు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో…నందును విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ…2017లో జరిపిన ఎక్సైజ్ విచారణనను సైతం నందు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Read More : Drugs Case Rakul : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరవుతారా?

ఇప్పటికే ఈ కేసులో పలువురు నటులకు, నటీమణులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా…డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ ఛార్మీ, రకూల్ ప్రీత్ సింగ్…విచారణను ఎదుర్కొన్నారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు నందును విచారిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న చార్మి, 6న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజతో పాటు అతని అసిస్టెంట్‌ శ్రీనివాస్‌… 13న నవదీప్‌, 15న ముమైత్‌ ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, సెప్టెంబర్‌ 22న తరుణ్‌.. ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. కానీ..నందు ముందుగానే హాజరయ్యారు.

Read More : Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ కార్యాలయంలో బండ్ల గణేష్

ఇప్పటికే ఎక్సైజ్‌ శాఖకు చెందిన సిట్‌ అధికారి శ్రీనివాస్‌ నుంచి ఈడీ సమాచారం సేకరించింది.ఇచ్చే ప్రతీ సమాధానం లిఖితపూర్వకంగా తీసుకోనుంది. 2017లో ఎక్సైజ్‌ శాఖ అరెస్ట్ చేసిన కెల్విన్, మైక్ కమింగా, విక్టర్ స్టేట్‌మెంట్ ఆధారంగా సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది. నిందితులతో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై ఈడీ ఫోకస్ చేయనుంది. ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఉన్న డ్రగ్స్ ముఠాల బ్యాంక్ ఎకౌంట్ వివరాలను సేకరించేందుకు ఇంటర్ పోల్ సహకారం తీసుకోనుంది ఈడీ. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేసిన 12మంది ప్రముఖులే కాకుండా… గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రశ్నించిన 62మందిలో మరికొందరిని కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది.