Drugs Case: నేడు ఈడీ ముందుకు తరుణ్.. విచారణ ముగుస్తుందా?

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ హీరో తరుణ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌..

Drugs Case: నేడు ఈడీ ముందుకు తరుణ్.. విచారణ ముగుస్తుందా?

Drugs Case

Drugs Case: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ హీరో తరుణ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈరోజు (బుధవారం) ప్రశ్నించనున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు తరుణ్ నమునాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చేశారు. పూరీ, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లు పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో వీరి నుంచి సేకరించిన నమూనాల్లో డ్రగ్స్ లేవని స్పష్టం చేసింది. కానీ, ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈడీ ఇప్పుడు విచారణ సాగిస్తుంది.

Telugu Film Hero’s: థియేటర్లపై హీరోల ఫోకస్.. సొంతగా కట్టేసుకుంటున్న స్టార్లు!

దీంతో ఇప్పుడు ఈ కేసులో విచారణ వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత మూడు వారాల నుండి సినీ సెలబ్రిటీల లావాదేవీలపై మళ్ళీ విచారణ మొదలు పెట్టిన ఈడీ అధికారులు ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది.

Big Boss 5: ఆ ఇద్దరితో లహరి బిజీ.. అగ్గిరాజేసిన ప్రియా కామెంట్స్

తొలుత కేసు అంతా డ్రగ్‌ సరఫరాదారుడు కెల్విన్‌ చుట్టూ తిరిగినా.. విచారణ క్రమంలో ఎఫ్‌-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈడీ అధికారులు పలువురి సెలబ్రిటీల నుండి వారివారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించగా.. ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్‌, అతడి స్నేహితుడు.. ఈవెంట్‌ మేనేజర్‌ జీషాన్‌అలీల బ్యాంక్‌ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు.

Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

ఇక, ఈడీ అధికారుల సమన్లు అందుకున్న 12 మందిలో చివరి వ్యక్తి తరుణ్‌ కాగా నేడు (బుధవారం) ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. తరుణ్‌ నుంచి వివరాలు సేకరించనున్న అధికారులు ఇప్పటికే బ్యాంక్‌ ఖాతాల వివరాలను తీసుకురావాలని సూచించారు. కెల్విన్‌తో సంబంధాలు, గతంలో ఎక్సైజ్‌ కేసు విచారణ సందర్భంగా చెప్పిన అంశాలపైనా ఆరా తీయనున్నట్టు తెలిసింది. అయితే తరుణ్‌తో ఈడీ అధికారుల విచారణ ముగుస్తుందా.. విచారణకు హాజరైన వారంతా ఇచ్చిన సమాచారంతో మరేమైనా కొత్త లింకులు బయటికి వస్తాయా? ఇంకెవరికైనా ఈడీ సమన్లు పంపనుందా? అనే చర్చలు జరుగుతున్నాయి.